నట సింహం నందమూరి బాలకృష్ణ(Nandamuri Balakrishna) ప్రస్తుతం కెరీర్ బెస్ట్ ఫామ్ లో దూసుకు పోతున్నాడు…హాట్రిక్ విజయాలతో మూడు వరుస 70 కోట్ల సినిమాలతో టాలీవుడ్ లో సీనియర్స్ లో ఎవ్వరూ సాధించని రికార్డ్ ను నమోదు చేసిన బాలయ్య ఇప్పుడు బాబీ డైరెక్షన్ లో NBK109 మూవీ చేస్తూ ఉండగా, అన్నీ అనుకున్నట్లు జరిగితే ఈ సినిమా…
ఆడియన్స్ ముందుకు ఈ ఇయర్ అక్టోబర్ లో రిలీజ్ అయ్యే అవకాశం ఉండగా త్వరలో బాలయ్య పుట్టిన రోజు అయిన జూన్ 10న సినిమా నుండి మరో కొత్త అప్ డేట్ రాబోతుంది అని సమాచారం. ఇక అదే రోజున బాలయ్య కెరీర్ లో బిగ్గెస్ట్ మూవీ ని అనౌన్స్ చేసే అవకాశం ఎంతైనా ఉందని ఇప్పుడు టాలీవుడ్ లో స్ట్రాంగ్ బజ్ ఉంది..
తను ఫ్లాఫ్స్ లో ఉన్న టైంలో ఎప్పటికప్పుడు వరుస కంబ్యాక్ లు ఇచ్చిన డైరెక్టర్ బోయపాటి శ్రీను(Boyapati Sreenu) డైరెక్షన్ లో బాలయ్య సింహా, లెజెండ్ మరియు అఖండ లాంటి బ్లాక్ బస్టర్ లను సొంతం చేసుకోగా ఇప్పుడు వీళ్ళ కాంబోలో కొత్త సినిమా ఉండబోతుంది….అది త్వరలోనే మొదలు కాబోతూ ఉండగా ఈ సినిమా…
బాలయ్య కెరీర్ బెస్ట్ బ్లాక్ బస్టర్ అయిన అఖండ(Akhanda2 Movie) మూవీకి సీక్వెల్ అని అంటూ ఉన్నారు….బాలయ్యకి ఆల్ రెడీ లైన్ కూడా వినిపించినట్లు తెలుస్తూ ఉండగా అత్యంత భారీ బడ్జెట్ తో ఈ సినిమాను పాన్ ఇండియా రేంజ్ లో రూపొందించాలని ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తుంది ఇప్పుడు…
ముందు వేరే కొత్త కథ అనుకున్నా కూడా అఖండ సీక్వెల్ అయితే ఆ హైప్ మరో లెవల్ లో ఉంటుంది కాబట్టి సీక్వెల్ చేయాలి అన్న ఆలోచనలోనే ఎక్కువగా ఉన్నారట. ఇక ఈ సినిమా ను బాలయ్య పుట్టిన రోజున అనౌన్స్ చేసే అవకాశం ఎంతైనా ఉందని అంటున్నారు. మరి ఇదే కనుక నిజం అయితే బాలయ్య ఖాతాలో మరో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అఖండ2 తో సొంతం అయ్యే అవకాశం ఎంతైనా ఉంటుంది.