ప్రస్తుతం టాలీవుడ్ లో జరుగుతున్న ట్రెండ్ చూస్తుంటే మాత్రం ఇది కచ్చితంగా అందరూ ఫాలో అవ్వాల్సిన విషయం గా చెప్పుకోవచ్చు. రీసెంట్ సంక్రాంతి బిగ్గీస్ సినిమాల కలెక్షన్స్ గొడవ సోషల్ మీడియా లో పీక్స్ లో ఉండగా ఇద్దరు హీరోల ఫ్యాన్స్ ఒకరి పై ఒకరు యాంటీ ట్రెండ్స్ కూడా చేసే రేంజ్ లో రచ్చ చేస్తున్నారు, మరో పక్క 2 ప్రొడక్షన్ హౌసెస్ కూడా వరుసగా పోస్టర్స్ ని వదలడం లాంటివి చేస్తూ…
మేమే గెలిచాం అంటే మేమే గెలిచాం అంటూ ఈ ఫ్యాన్స్ ని మరింత ఉసిగొల్పేవిగా చేస్తున్నారు. దాంతో రచ్చ మరింత పెద్దది అవుతుంది. తమ సినిమా ఇంత కలెక్ట్ చేసింది అని గొప్పగా చెప్పుకోవడం లో ఎలాంటి తప్పు లేదు… కానీ అదే పనిగా ఒకరి తర్వాత ఒకరు ఈ పోస్టర్స్ లో..
హైప్ నంబర్స్ తో అందరినీ పిచ్చోళ్ళు చేస్తున్నారు అన్నది అక్షర సత్యం. ఇలాంటి టైం లో రామ్ చరణ్ చెప్పిన స్టేట్ మెంట్ అందరు హీరోలు ప్రొడక్షన్ హౌసెస్ ఫాలో అయితే సగం ఫ్యాన్ వార్స్ ఆగిపోతాయి. రామ్ చరణ్ రంగస్థలం 200 కోట్ల కాంట్రవర్సీ తర్వాత ఇక నా సినిమాల కలెక్షన్స్, నేను నిర్మించే సినిమాల కలెక్షన్స్ పోస్టర్స్ వేయను అంటూ మాట చెప్పాడు.
అది వినయ విదేయ రామ, సైరా సినిమాల విషయం లో పాటించి శెభాష్ అనిపించాడు. రామ్ చరణ్ ఇలా చెప్పడానికి కూడా రీజన్ ఉంది. రంగస్థలం యునానిమస్ రెస్పాన్స్ తో దూసుకుపోతున్న టైం లో రోజు కలెక్షన్స్ రిలీజ్ అవుతుండగా… 5 వారాల సమయంలో…
ట్రేడ్ లో ఇక సినిమా 200 కోట్ల గ్రాస్ ని అందుకుంటుంది అని అనుకుంటున్న టైం లో యూనిట్ మిస్టేక్ గా 185 కోట్లు క్రాస్ అయిందని పోస్టర్ వదిలారు.. తప్పు తెలుసుకుని తిరిగి 3-4 రోజుల తర్వాత 200 కోట్ల పోస్టర్ ని వదిలారు. దాంతో అప్పటి వరకు ఎలాంటి కాంట్రవర్సీ లేని సినిమా పై…ఒక్కసారి ఇతర హీరోల ఫ్యాన్స్ ఫైర్ అయ్యారు…
ఫేక్ కలెక్షన్స్ వేసుకున్నారు అంటూ రేచ్చిపోగా అది రామ్ చరణ్ వరకు వెళ్ళగా, ప్రెస్ మీట్ లో పైన చెప్పిన విధంగా ఇక కలెక్షన్స్ పోస్టర్స్ జోలికి పోము అని డిసైడ్ అయ్యాడు. సైరా విషయం లో కూడా ఎదో ప్రెస్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇంత కలెక్ట్ చేస్తుందని అంచనా వేస్తున్నాం అని చెప్పాడు కానీ పోస్టర్ వదలలేదు….ఇదే పద్దతి ఇప్పుడు అందరు హీరోలు ఫాలో అయితే సగానికి పైగా ఫ్యాన్ వార్స్ ఆగిపోవడం ఖాయమని చెప్పొచ్చు.