స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ల కాంబినేషన్ లో తెరకెక్కుతున్న లేటెస్ట్ సెన్సేషనల్ మూవీ అల వైకుంఠ పురం లో అన్ని హంగులను పూర్తీ చేసుకుని 12 న రిలీజ్ అవ్వడానికి సిద్దం అవుతుండగా సినిమా రీసెంట్ గా సెన్సార్ పనులను పూర్తీ చేసుకోగా యు/ఏ సర్టిఫికేట్ ని సొంతం చేసుకున్న సినిమా 2 గంటల 36 నిమిషాల లెంత్ తో రాబోతుంది. ఇక సినిమా ఓవరాల్ గా సాధించిన బిజినెస్ లెక్కలు తేలాయి.
సినిమా మొత్తం మీద అల్లు అర్జున్ కెరీర్ లోనే నంబర్ 1 బిజినెస్ చేసిన సినిమా గా నిలిచింది, రీసెంట్ టైం లో సరైనోడు తర్వాత క్లీన్ హిట్ లేకున్నా నా పేరు సూర్య తర్వాత భారీ గ్యాప్ వచ్చినా కానీ ఈ సినిమా బిజినెస్ పరంగా ఓవరాల్ గా 84 కోట్ల మార్క్ ని అధిగమించి దుమ్ము లేపింది.
మొత్తం మీద ఏరియాల వారి బిజినెస్ ను గమనిస్తే
?Nizam: 20Cr
?Ceeded: 12.06Cr
?UA: 8.50Cr
?East: 6.30Cr
?West: 5Cr
?Guntur: 6.30Cr
?Krishna: 5Cr
?Nellore: 2.78Cr
AP-TG Total:- 65.94CR??
Karnataka: 7.20Cr
ROI: 1.40Cr
OS: 9.80Cr
Total: 84.34Cr
ఇక రీసెంట్ టైం లో అల్లు అర్జున్ లాస్ట్ 5 మూవీస్ బిజినెస్ లను ఒకసారి గమనిస్తే
?#AlaVaikunthapurramuloo – 84.34Cr
?#NaaPeruSurya – 75Cr
?#DJ – 78Cr
?#Sarrainodu – 54Cr
?#SonOfSathyamurthy – 51Cr~
యావరేజ్ గా 5 సినిమాల బిజినెస్ లలో అల్లు అర్జున్ ఇప్పుడు 68 కోట్ల రేంజ్ బిజినెస్ ని సొంతం చేసుకుంటున్నాడు. ఇప్పుడు అల వైకుంఠ పురంలో ఏకంగా 84 కోట్లకు పైగా బిజినెస్ ని సొంతం చేసుకుంది.
ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా క్లీన్ హిట్ అవ్వాలి అంటే 85 కోట్ల రేంజ్ లో షేర్ ని బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకోవాల్సి ఉంటుంది, పోటి గట్టిగా ఉన్నా సినిమా కి పాజిటివ్ టాక్ వస్తే ఫ్యామిలీ ఆడియన్స్ సపోర్ట్ తో సినిమా ఈ మార్క్ ని అందుకునే అవకాశం ఉందని చెప్పొచ్చు. మరి ఏం జరుగుతుందో చూడాలి.