Home న్యూస్ మోస్ట్ డిస్ లైక్స్ నుండి…ఆల్ టైం హైయెస్ట్…ఎపిక్ రికార్డ్ కొట్టిన అల్లు అర్జున్!!

మోస్ట్ డిస్ లైక్స్ నుండి…ఆల్ టైం హైయెస్ట్…ఎపిక్ రికార్డ్ కొట్టిన అల్లు అర్జున్!!

1992
0

స్టైలిష్ స్టార్ నుండి ఐకాన్ స్టార్ గా మారిన అల్లు అర్జున్ నటించిన లేటెస్ట్ మూవీ అల వైకుంఠ పురంలో ఆల్ టైం నాన్ బాహుబలి ఇండస్ట్రీ హిట్ కొట్టగా ఇప్పుడు అల్లు అర్జున్ సుకుమార్ తో కలిసి చేస్తున్న పాన్ ఇండియా సెన్సేషనల్ మూవీ పుష్ప కోసం అందరూ ఆశగా ఎదురు చూస్తున్నారు. సినిమా ఫస్ట్ లుక్ నుండే ఆడియన్స్ లో సాలిడ్ క్యూరియాసిటీ ని క్రియేట్ చేసిన ఈ సినిమా…

రెండు భాగాలుగా ఆడియన్స్ ముందుకు రావడం కన్ఫాం అయ్యింది. ఇక సినిమాలో అల్లు అర్జున్ క్యారెక్టర్ ఇంట్రో టీసర్ కి మెయిన్ టీసర్ రేంజ్ లో రెస్పాన్స్ ఆడియన్స్ నుండి వస్తూ ఉండటం యూట్యూబ్ లో వ్యూస్ పరంగా కానీ లైక్స్ పరంగా కానీ ఈ టీసర్…

ఆల్ టైం ఎపిక్ రికార్డులను నమోదు చేయడం జరిగింది. ఇక్కడ గమనించాల్సిన విషయం అల్లు అర్జున్ నటించిన దువ్వాడ జగన్నాథం సినిమా టీసర్ టాలీవుడ్ చరిత్రలో ఆ టైం కి హైయెస్ట్ డిస్ లైక్స్ ని సొంతం చేసుకున్న టీసర్ గా రికార్డ్ కొట్టింది. అలాంటి బ్యాడ్ రికార్డ్ నుండి…

ఇప్పుడు ఏకంగా టాలీవుడ్ తరుపున హైయెస్ట్ లైక్స్ రికార్డ్ ను సొంతం చేసుకుని అల్లు అర్జున్ రికార్డ్ సృష్టించగా పుష్ప టీసర్ రీసెంట్ గా ఏకంగా 75 మిలియన్ వ్యూస్ మార్క్ ని అందుకుని టాలీవుడ్ తరుపున ఈ మార్క్ ని అందుకున్న మొట్ట మొదటి టీసర్ గా ఎపిక్ రికార్డ్ ను నమోదు చేసింది. ఈ రేంజ్ లో మోస్ట్ డిస్ లైక్స్ నుండి హైయెస్ట్ లైక్స్ కి…..

అలాగే హైయెస్ట్ వ్యూస్ రికార్డ్ ను కూడా సొంతం చేసుకుని అల్లు అర్జున్ సత్తా చాటాడు. అల వైకుంఠ పురంలో ఇండస్ట్రీ హిట్ తర్వాత వస్తున్న పుష్పకి ఏమాత్రం టాక్ వచ్చినా అల్టిమేట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకోవడం ఖాయం. మరి బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ సినిమా ఏ రేంజ్ లో రచ్చ చేస్తుందో చూడాలి ఇక.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here