Home న్యూస్ అల్లుడు అదుర్స్ మూవీ రివ్యూ…ప్లస్ అండ్ మైనస్ పాయింట్స్!!

అల్లుడు అదుర్స్ మూవీ రివ్యూ…ప్లస్ అండ్ మైనస్ పాయింట్స్!!

0

ఎవ్వరూ ఎక్స్ పెర్ట్ చేయని విధంగా సంక్రాంతి రేసులో ఎంటర్ అయిన సినిమా అల్లుడు అదుర్స్… సడెన్ గా అనౌన్స్ చేసి 15 న రిలీజ్ అని చెప్పి మళ్ళీ ఒక రోజు ముందుకు జరిపి 14 న సినిమాను రిలీజ్ చేయగా సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర రీసెంట్ గా గ్రాండ్ రిలీజ్ ను సొంతం చేసుకుంది. మరి సినిమా ఎంతవరకు అంచనాలను అందుకుంది, ఎంతవరకు మెప్పించింది లాంటి విశేషాలను తెలుసు కుందాం పదండీ…

కథ పాయింట్ కి వస్తే…చిన్నప్పుడు అను ఎమాన్యుఎల్ ని ఇష్టపడ్డ హీరో తన లవ్ ప్రొపోజ్ చేసే టైం కి అను కనిపించకుండా పోతుంది. దాంతో తనని హేట్ చేస్తూ పెరిగిన హీరో కొన్ని కారణాల వల్ల ఫాక్షనిస్ట్ అయిన ప్రకాష్ రాజ్ ఇంట్లో ఉండే నభా నటేష్ ను ఇష్టపడతాడు…

తర్వాత లవ్ ప్రొపోజ్ చేసే టైం లో అను తిరిగి వస్తుంది… తర్వాత ఎం జరిగింది, ప్రకాష్ రాజ్ తో హీరో ఎలా ఒక ఆట ఆదుకున్నాడు. సోనూ సూద్ రోల్ ఏంటి అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే… పెర్ఫార్మెన్స్ పరంగా బెల్లంకొండ శ్రీనివాస్ తన రొటీన్ యాక్టింగ్ తో…

కమర్షియల్ మూవీ లో ఎలా ఉండాలో అలా నటిస్తూ వెళ్ళాడు… నటన పరంగా ఇంకా చాలా ఇంప్రూవ్ అవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పాలి. ఇక సూనూసూద్ రోల్ పర్వాలేదు అనిపించగా తన గ్యాంగ్ తో కొన్ని కామెడీ సీన్స్ మెప్పించాయి. ఇక అను ఎమాన్యుఎల్ మరియు ప్రకాష్ రాజ్ ల రోల్స్ జస్ట్ ఓకే అనిపించే విధంగా ఉండగా నభా నటేష్ మాస్ ని బాగానే ఆకట్టుకుంది అని చెప్పాలి.

ఇక సంగీతం విషయానికి వస్తే దేవి శ్రీ ప్రసాద్ ఒకటి రెండు పాటలతో పర్వాలేదు అనిపించినా అవి తన రేంజ్ కి తగ్గ సాంగ్స్ కావు, ఇక బ్యాగ్రౌండ్ స్కోర్ బిలో యావరేజ్ గా అనిపిస్తుంది. ఎడిటింగ్ అండ్ స్క్రీన్ ప్లే రొటీన్ కమర్షియల్ మూవీస్ కన్నా వీక్ గా ఉంది…

ప్రొడక్షన్ వాల్యూస్ చాలా రిచ్ గా ఉండగా వాటిని సినిమాటోగ్రఫర్ అద్బుతంగా చూపెట్టాడు…ఇక డైరెక్షన్ విషయానికి వస్తే సంతోష్ శ్రీనివాస్ ఏమాత్రం ఇంప్రెస్ చేయలేక పోయాడు… ఈ కథని ఇప్పటికి ఎన్ని సార్లు తెలుగు సినిమాల్లో చూసి ఉంటామో లెక్కే లేదు… వాడి వాడి పాత బడిన ఈ కాన్సెప్ట్ కి…

కొత్త హంగులు అంటూ కొన్ని జోడించినా కానీ అవి కూడా నీరసంగా ఉండటం తో అక్కడక్కడా కొన్ని సీన్స్ మినహా సినిమా కంప్లీట్ గా నిరాశ పరుస్తుంది… నీరసమైన స్క్రీన్ ప్లే అండ్ రొటీన్ కథ ప్రిడిక్ట్ చేసే విధంగా ఉండటం, తెరపై సీన్స్ ఒకటి తర్వాత ఒకటి వెళుతున్నా ఒక్కటి కూడా…

కనెక్ట్ అవ్వలేని పరిస్థితి నెలకొంది ఈ సినిమా విషయంలో. మొత్తం మీద సినిమా రొటీన్ మూవీస్ చూసే వాళ్ళని కూడా ఇంప్రెస్ చేయడం కష్టమే అనిపించే విధంగా ఉందని చెప్పాలి. మొత్తం మీద సినిమా కి మేం ఇస్తున్న రేటింగ్ 1.5 స్టార్స్… ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా ఎలా పెర్ఫార్మ్ చేస్తుందో చూడాలి ఇక…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here