మొదటి 2 రోజుల్లో అంచనాలను మించి కలెక్షన్స్ తో మాస్ రచ్చ చేసిన శివ కార్తికేయన్(Siva Kartikeyan) సాయి పల్లవి(Sai Pallavi) ల కాంబోలో తెరకెక్కిన అమరన్(Amaran Movie) సినిమా తమిళనాడులో ఊరమాస్ హోల్డ్ ని చూపెడుతూ ఉండగా తెలుగు రాష్ట్రాల్లో సైతం మిగిలిన సినిమాలకు ధీటుగా కలెక్షన్స్ పరంగా…
కుమ్మేస్తూ దూసుకు పోతుంది. రెండు రోజుల్లో మాస్ కలెక్షన్స్ ని సాధించిన తర్వాత మూడో రోజు తెలుగు లో కొంచం డ్రాప్స్ ను సొంతం చేసుకున్నా తమిళ్ లో ఎక్స్ లెంట్ గా జోరు ని కొనసాగిస్తుంది సినిమా….తెలుగు రాష్ట్రాల్లో మూడో రోజు సినిమా ప్రజెంట్ ట్రెండ్ ను…
బట్టి చూస్తూ ఉంటే అటూ ఇటూగా 1.8 కోట్ల రేంజ్ నుండి ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు బాగుంటే 2 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం కనిపిస్తూ ఉండగా ఫైనల్ ఆఫ్ లైన్ లెక్కలను బట్టి కలెక్షన్స్ లో గ్రోత్ ఉండే అవకాశం ఉందని చెప్పాలి.
ఇక తమిళనాడులో మొదటి రోజు ఏమాత్రం తీసిపోని రేంజ్ లో జోరుని సినిమా చూపెడుతూ ఉండగా 16 కోట్లకు పైగానే గ్రాస్ ను అందుకునే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇక కేరళ మరియు కర్ణాటకలో సైతం సినిమా ఎక్స్ లెంట్ జోరుని చూపిస్తూ ఉండగా…
ఓవర్సీస్ లో సైతం సినిమా ఎక్స్ లెంట్ ట్రెండ్ ను చూపెడుతూ ఉండటంతో మూడో రోజు వరల్డ్ వైడ్ గా మరోసారి 30 కోట్లకు పైగానే గ్రాస్ ను సినిమా అందుకునే అవకాశం ఉండగా, ఫైనల్ లెక్కలు అంచనాలను కనుక మించి పొతే ఈ కలెక్షన్స్ మార్క్ ని కూడా సినిమా క్రాస్ చేసే అవకాశం ఉంది. ఇక టోటల్ గా 3 రోజుల అఫీషియల్ కలెక్షన్స్ ఎలా ఉంటాయో చూడాలి.