బాలీవుడ్ లో ప్రస్తుతం సౌత్ సినిమాలే మళ్ళీ దిక్కు అయినట్లు ఉన్నాయి… వరుస పెట్టి సౌత్ సినిమాలు బాలీవుడ్ లో రీమేక్ అవుతూ వస్తున్నాయి. ఇప్పుడు తాజాగా మరో తమిళ్ బ్లాక్ బస్టర్ మూవీ ని హిందీ లో రీమేక్ చేయడానికి సిద్ధం చేస్తున్నారు. కానీ ఈ సారి స్టార్ కాస్ట్ లో బాలీవుడ్ సూపర్ స్టార్ అమీర్ ఖాన్ ఉన్నాడు అన్న వార్తలతో సినిమా పై ఇప్పటి నుండే స్కై హై అంచనాలు ఏర్పడ్డాయి అని చెప్పొచ్చు.
తమిళ్ లో రెండేళ్ళ క్రితం రిలీజ్ అయ్యి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన మల్టీస్టారర్ “విక్రం వేద” సినిమాను ఇప్పుడు హిందీ లో రీమేక్ చేయబోతున్నారు. కాగా ఇందులో అమీర్ ఖాన్ కి తోడు గా సైఫ్ అలీ ఖాన్ కూడా కనిపించబోతున్నట్లు సమాచారం.
దొంగ పోలిస్ మధ్య మైండ్ గేం తో సాగే ఈ సినిమా లో రెండు పాత్రలకు సమానమైన ప్రాదాన్యత ఉంటుంది, దాంతో ఈ సినిమా పై టాలీవుడ్ హీరోల కళ్ళు కూడా పడ్డా ఎందుకనో ఇప్పటి వరకు సినిమా పట్టాలు ఎక్కలేదు. కానీ ఇంతలో ఈ సినిమాను హిందీ లో రీమేక్ చేయాలనీ డిసైడ్ అవ్వడం తో…
అమీర్ ఖాన్ అంటేనే సినిమా సినిమా కి ఇండస్ట్రీ రికార్డులను తిరగరాసే హీరో అన్న విషయం అందరికీ తెలిసిందే, అసలే వరుస ఇండస్ట్రీ హిట్ల తర్వాత లాస్ట్ ఇయర్ తగ్స్ ఆఫ్ హిందూస్తాన్ తో ఫ్లాఫ్ ఎదురుకున్న అమీర్ ఇలాంటి ఇంటెన్స్ యాక్షన్ మూవీ ని ఒప్పుకోవడం తో ఒరిజినల్ లో…
ఉన్నట్లు తీసినా బాలీవుడ్ మార్కెట్ దృశ్యా ఇండియా లో 400 కోట్లు అవలీలగా వసూల్ చేసే సత్తా ఉన్న సినిమా గా ఇప్పటి నుండే ట్రేడ్ వర్గాలు సినిమా పై అంచనాలు పెంచుతున్నాయి. మరి సినిమా ఈ అంచనాలను నిజం చేస్తుందో లేదో చూడాలి… న్యూస్ అప్ డేట్స్ కోసం బెల్ ఐకాన్ ని ప్రెస్ చేసి సబ్ స్బైబ్ చేసుకోండి.. అప్ డేట్ రాగానే నోటిఫికేషన్ మీకు అందుతుంది.