మిస్టర్ పెర్ఫెక్షనిస్ట్ గా పేరున్న బాలీవుడ్ ఏస్ ఖాన్ అమీర్ ఖాన్(Amir Khan) వరుస బ్లాక్ బస్టర్స్ తో బాలీవుడ్ ఇండస్ట్రీ రికార్డులను బ్రేక్ చేసి ఒక దశలో ఎవ్వరికీ అందనంత ఎత్తులో దూసుకు పోతున్న టైంలో థగ్స్ ఆఫ్ హిందుస్థాన్ లాంటి ఎపిక్ డిసాస్టర్ తర్వాత కొంత గ్యాప్ తీసుకుని చేసిన లాల్ సింగ్ చడ్డా మూవీ….
రెండేళ్ళ క్రితం రిలీజ్ అయ్యి ఆల్ టైం ఎపిక్ డిసాస్టర్ గా నిలిచింది. బాక్ టు బాక్ ఎపిక్ డిసాస్టర్స్ ను అందుకున్న అమీర్ ఖాన్ ప్రస్తుతం సినిమాల నుండి కొంత గ్యాప్ తీసుకున్నాడు…కానీ ఇప్పుడు లేటెస్ట్ గా ఓ బ్లాక్ బస్టర్ హిట్ మూవీ రీమేక్ రైట్స్ దక్కించుకున్నాడు అమీర్ ఖాన్…
ఖానీ రీమేక్ లు అసలు ఏమాత్రం వర్కౌట్ అవ్వని ఈ టైంలో మళ్ళీ రీమేక్ రైట్స్ ని తీసుకుని ఆ రీమేక్ తో కంబ్యాక్ ను ఎక్స్ పెర్ట్ చేస్తున్నాడన్న టాక్ బాలీవుడ్ లో చక్కర్లు కొడుతూ ఉండటంతో అందరూ షాకవుతున్నారు ఇప్పుడు…ఆ సినిమా మరేదో కాదు రీసెంట్ గా వచ్చిన…
విజయ్ సేతుపతి 50వ సినిమాగా వచ్చిన బ్లాక్ బస్టర్ మహారాజ(Maharaja Movie) 100 కోట్లు దాటేసి బ్లాక్ బస్టర్ గా నిలిచి డిజిటల్ లో కూడా రిలీజ్ అవ్వగా అన్ని భాషల డబ్ వర్షన్ అందుబాటులోకి వచ్చింది. హిందీలో కూడా అందుబాటులో ఉన్న ఈ సినిమాను ఆల్ రెడీ జనాలు చూసేశారు…
ఆల్ రెడీ రీమేక్ తోనే ఎపిక్ డిసాస్టర్ ను లాల్ సింగ్ చడ్డాతో అందుకున్న అమీర్ ఖాన్ ఇప్పుడు మళ్ళీ రీమేక్ తో కంబ్యాక్ చేయాలనీ చూస్తూ ఉండటం అందరినీ ఆశ్యర్యపరుస్తుంది. ఒకప్పుడు బాలీవుడ్ ను ఏలిన అమీర్ ఖాన్ ఇప్పుడు పూర్తిగా స్లో అవ్వగా ఈ రీమేక్ కంబ్యాక్ ఇస్తాడా లేక మరోసారి నిరాశ పరుస్తాడో త్వరలో తేలనుంది…