భారతీయ సినిమా హిస్టరీలో ఇప్పుడు భారీ బడ్జెట్ తో మూవీస్, భారీ గ్రాఫిక్ మూవీస్ తరచుగా వస్తూ ఉండటం మనం వాటిని చూస్తూ ఉండటం కామన్ అయ్యింది కానీ అసలు ఇండియాలో మొట్ట మొదటి సారిగా ఫుల్ లెంత్ గ్రాఫిక్స్ ని వాడిన రికార్డ్ మన టాలీవుడ్ దే అన్న విషయం తక్కువ మందికే తెలుసు, కోడి రామకృష్ణ గారి డైరెక్షన్ లో శ్యామ్ ప్రసాద్ రెడ్డి నిర్మాణం లో తెరకెక్కిన అమ్మోరు సినిమా…
అందరి కీ గుర్తు ఉండే ఉంటుంది, ఆ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలాంటి సంచలనాలు సృష్టించిందో కూడా అందరికీ తెలిసిందే, ఇండియన్ సినిమా హిస్టరీలో గ్రాఫిక్స్ తో ఫుల్ మూవీ రావడం అమ్మోరు సినిమా తోనే మొదలు, ఇప్పటికీ ఆ గ్రాఫిక్స్ అండ్ సినిమా క్వాలిటీ నెక్స్ట్ లెవల్ లో ఉంటుంది అంటే అప్పట్లో…
ఈ సినిమా కోసం ఎంత కష్టపడ్డారో అర్ధం చేసుకోవచ్చు, దాదాపు 4 ఏళ్ళు నిర్మాణం అయిన ఈ సినిమా కోసం సౌందర్య గారు 40 వేల రెమ్యునరేషన్ తో ఒప్పుకోగా, 3 వ సినిమాగా మొదలైన ఈ సినిమా రిలీజ్ టైం కి ఆమె 27 వ సినిమాగా రిలీజ్ అయ్యింది,
రమ్యకృష్ణ చేసిన అమ్మోరు రోల్ కి మొదట్లో ఈ సినిమాకి ఆమె ఎందుకు అని వ్యతిరేకించిన వారితోనే అమ్మోరు రోల్ కి ఆమె తప్ప మరెవ్వరూ సూట్ అయ్యి ఉండరేమో అనిపించుకుంది. అలాంటి ఈ సినిమా రిలీజ్ అయ్యి 26 ఏళ్ళు పూర్తీ అయిన సందర్భంగా ఇండియన్ తొలి గ్రాఫిక్ మూవీ గురించి అందరూ మెచ్చుకుంటూ ఉన్నారు. సినిమాను 4 ఏళ్ళు నిర్మించిన…
శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారు ఏకంగా ఆ టైం లో 1.8 కోట్ల రేంజ్ బడ్జెట్ లో సినిమాను నిర్మించగా తెలుగు లో 2 వారాలు జస్ట్ యావరేజ్ అనిపించేలానే రన్ అయిన ఈ సినిమా తర్వాత విశ్వరూపం చూపించి ఏకంగా 11 కోట్ల వరకు షేర్ ని రాబట్టగా తమిళ్ లో డబ్ అయినప్పుడు 1 కోటి గ్రాస్ ని ఇతర భాషలు హిందీ లో కలిపి మరో 2 కోట్ల షేర్ ని మొత్తంమీద 13.5 కోట్ల షేర్ తో ఊహకందని బ్లాక్ బస్టర్ గా నిలిచింది ఈ సినిమా…