ఏడాది కి పైగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిన సినిమా అరవింద సమేత రిలీజ్ కి సమయం ఆసన్నం అయ్యింది…అత్యంత భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సెన్సేషనల్ మూవీ ఓవరాల్ గా 91 కోట్ల బిజినెస్ ని దక్కించుకుని 92 కోట్ల టార్గెట్ తో బరిలోకి దిగబోతుంది.
ఇక టోటల్ గా సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ ని గమనిస్తే…నైజాంలో సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ అదిరిపోగా…కొన్ని ఏరియాలను చాలా ఆలస్యంగా ఆన్ లైన్ బుకింగ్స్ లో పెట్టడంతో వాటి బుకింగ్స్ ఇంకా జరుగుతుంది…ఓవరాల్ గా నైజాం బుకింగ్స్ 75% ప్రస్తుతం జరగగా మొదటి షో సమయానికి 90% కి చేరుకుంటుంది.
ఇక ఆంధ్రా సీడెడ్ లలో కూడా చాలా ఏరియాలను ఆలస్యంగా యాడ్ చేశారు…కానీ అప్పటికె యాడ్ చేసిన ఏరియాల బుకింగ్స్ 80% ని టచ్ చేయగా ఇప్పుడు కొత్తగా యాడ్ చేసిన ఏరియాల బుకింగ్స్ కూడా మొదటి షో సమయానికి పుంజుకుని టోటల్ గా 95% బుకింగ్స్ ని సొంతం చేసుకోనుంది.
ఇక కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియా లో ఇప్పటి వరకు అందిన రిపోర్ట్స్ ప్రకారం సినిమా 60% బుకింగ్స్ ని సొంతం చేసుకోగా ఓవర్సీస్ లో బుకింగ్స్ 70% ని క్రాస్ చేసిందట….ఈ లెక్కన సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో మినిమమ్ 24 కోట్ల రేంజ్ లో షేర్ అందుకోవడం ఖయామని చెప్పొచ్చు. ఇక కర్ణాటకలో 4 కోట్లకి తగ్గకుండా కలెక్షన్స్ ఉంటాయి.
ఇక ఓవర్సీస్ లో ప్రీమియర్స్ మినిమమ్ 0.7 మిలియన్ టచ్ చేయడం ఖాయం…అలాగే రెస్ట్ ఆఫ్ ఇండియా మరియు రెస్ట్ ఆఫ్ వరల్డ్ కూడా సాలిడ్ గా కలెక్షన్స్ ని సొంతం చేసుకోబోతుంది ఈ సినిమా…టోటల్ గా మొదటి రోజు వరల్డ్ వైడ్ కలెక్షన్స్ లెక్క మినిమమ్ 32 కోట్ల నుండి స్టార్ట్ అవుతుంది…టాక్ బాగుంటే ఈ లెక్క ఎంత వరకు వెళుతుంది అనేది ఇప్పుడు ఆసక్తిగా మారింది.