Home TRP రేటింగ్ ‘అశ్వథ్థామ’ TRP: అమ్మింది 3.15 కోట్లు… TRP తెలిస్తే షాక్!!

‘అశ్వథ్థామ’ TRP: అమ్మింది 3.15 కోట్లు… TRP తెలిస్తే షాక్!!

2029
0

యంగ్ హీరో నాగశౌర్య బాక్స్ ఆఫీస్ దగ్గర రీసెంట్ టైం లో సరైన హిట్ కోసం ఎదురు చూస్తూనే ఉన్నాడు…ఊహలు గుసగుసలాడే సినిమా తో మంచి ఎంట్రీ ఇచ్చినప్పటికీ తర్వాత అడపా దడపా సినిమా లు చేసినా కమర్షియల్ హిట్ ని మాత్రం ఛలో సినిమా తో సొంతం చేసుకున్నాడు, కానీ మళ్ళీ ఆ సినిమా నుండి ఇప్పటి వరకు చేసిన సినిమా లు అన్నీ బాక్స్ ఆఫీస్ దగ్గర నిరాశ పరిచినవే…

ఇక రీసెంట్ గా మళ్ళీ తన నిర్మాణం లో తానె ఓన్ గా రాసుకున్న కథ తో తెరకెక్కించిన లేటెస్ట్ మూవీ ‘అశ్వథ్థామ’ తో ప్రేక్షకుల ముందుకు రాగా ఈ సినిమా పర్వాలేదు అనిపించే టాక్ ని సొంతం చేసుకున్నా కానీ టార్గెట్ ని అందుకోలేదు.

సినిమా ను 6.5 కోట్లకు అమ్మగా టోటల్ గా 4.8 కోట్ల రేంజ్ షేర్ ని మాత్రమె అందుకుని ఫ్లాఫ్ అయింది, ఇక ఈ సినిమా కి శాటిలైట్ రైట్స్ కింద ఏకంగా 3.15 కోట్ల రేటు దక్కింది, యంగ్ హీరోలకు ఇది సాలిడ్ రేటు అనే చెప్పాలి. ఇక రీసెంట్ గా సినిమా…

టెలివిజన్ లో టెలికాస్ట్ కాగా మొదటి సారి టెలికాస్ట్ అయినా కానీ మంచి TRP రేటింగ్ ని ఈ సినిమా సొంతం చేసుకుని దుమ్ము లేపింది, 3.15 కోట్ల రేటు చెల్లించిన జెమినీ టీవీ లో రీసెంట్ గా టెలికాస్ట్ అయ్యి ఈ సినిమా 9.10 TRP రేటింగ్ మొదటి సారే దక్కడం విశేషం, సినిమా మెయిన్ కంటెంట్ కంప్లీట్ ఫ్యామిలీ ఫ్రెండ్లీ కాకున్నా కానీ మంచి TRP రేటింగ్ ని అందుకుంది.

ఇక్కడ విశేషం ఏంటి అంటే నాగశౌర్య కెరీర్ లో ఇది ఆల్ టైం హైయెస్ట్ TRP రేటింగ్ అని అంటున్నారు, బాక్స్ ఆఫీస్ దగ్గర నిరాశ పరిచినా కానీ సినిమా కంటెంట్ కి బుల్లి తెరపై మంచి TRP రేటింగ్ రావడం అది నాగశౌర్య కెరీర్ బెస్ట్ అవ్వడం తో యూనిట్ ఆనందం లో ఉందని చెప్పొచ్చు…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here