స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన లేటెస్ట్ సెన్సేషనల్ మూవీ అల వైకుంఠ పురం లో బాక్స్ ఆఫీస్ దగ్గర టాలీవుడ్ న్యూ నాన్ బాహుబలి ఇండస్ట్రీ హిట్ గా నిలిచిన విషయం తెలిసిందే, ఇక సినిమా మూడో వారం వర్కింగ్ డేస్ లో కూడా స్టడీ కలెక్షన్స్ తో జోరు చూపుతూ దూసుకుపోగా ఓవరాల్ గా సినిమా కలెక్షన్స్ 20 రోజుల సమయానికి మొత్తం మీద టాలీవుడ్ చరిత్ర లోనే సరికొత్త రికార్డ్ ను సాధించింది.
టాలీవుడ్ హిస్టరీ లోనే ఆల్ టైం బిగ్గెస్ట్ ప్రాఫిటబుల్ మూవీ గా సరికొత్త రికార్డ్ ను నమోదు చేసింది ఈ సినిమా… ఇది వరకు మీడియం రేంజ్ మూవీ గా చాలా తక్కువ బడ్జెట్ తో తెరకెక్కిన గీత గోవిందం ఓవరాల్ గా 5 కోట్ల రేంజ్ లోనే తెరకెక్కగా బాక్స్ ఆఫీస్ దగ్గర ఆ సినిమా మొత్తం మీద…
15 కోట్ల రేంజ్ లో బిజినెస్ చేయగా ఫైనల్ రన్ లో ఏకంగా 70.40 కోట్ల షేర్ మార్క్ ని అందుకోగా అందులో ఏకంగా 55.40 కోట్ల ప్రాఫిట్ ని సొంతం చేసుకుని నాన్ బాహుబలి మూవీస్ లో ఆల్ టైం బిగ్గెస్ట్ ప్రాఫిట్ ని అందుకున్న సినిమాగా చరిత్రకెక్కింది.
ఇప్పుడు ఆ రికార్డ్ ను బీట్ చేసి ఏకంగా సరికొత్త బెంచ్ మార్క్ ని సెట్ చేసింది అల వైకుంఠ పురం లో సినిమా. బాక్స్ ఆఫీస్ దగ్గర 19 రోజులు పూర్తీ అయ్యే సరికి ఆల్ మోస్ట్ 67 కోట్ల ప్రాఫిట్ ని సొంతం చేసుకున్న ఈ సినిమా 3 వారాలు పూర్తీ అయ్యే సరికి ఏకంగా 68 కోట్ల ప్రాఫిట్ ని సొంతం చేసుకోనుంది.
ఇక ఫైనల్ రన్ పూర్తీ అయ్యే సరికి ఏకంగా 70 కోట్ల రేంజ్ లో ప్రాఫిట్ ని సినిమా సొంతం చేసుకోవడం ఖాయమని చెప్పొచ్చు. ఈ రికార్డ్ ఇప్పట్లో బ్రేక్ అవ్వడం కష్టమే కానీ… మళ్ళీ టాప్ హీరోల సినిమాల పరంగా కానీ మీడియం రేంజ్ క్రేజీ మూవీస్ పరంగా కానీ సరికొత్త రికార్డులు నమోదు చేస్తే ఈ రికార్డ్ బ్రేక్ అయ్యే చాన్స్ ఉంటుంది….