Home న్యూస్ బేబీ బిజినెస్, థియేటర్స్ కౌంట్….బ్రేక్ ఈవెన్ టార్గెట్!

బేబీ బిజినెస్, థియేటర్స్ కౌంట్….బ్రేక్ ఈవెన్ టార్గెట్!

1

ఈ వీకెండ్ లో ఆడియన్స్ ముందుకు రాబోతున్న సినిమాల్లో చిన్న సినిమానే అయినా కూడా మంచి క్యూరియాసిటీని మంచి బజ్ ను సొంతం చేసుకున్న సినిమా బేబీ(Baby the Movie) అని చెప్పాలి. పాటలు సూపర్ హిట్ అవ్వడం ట్రైలర్ కూడా బాగా క్లిక్ అవ్వడం సినిమాకి కలిసి వచ్చింది…

దాంతో ట్రేడ్ లో కూడా ఈ సినిమా మీద మంచి బజ్ ఏర్పడగా మేకర్స్ చాలా సెంటర్స్ లో ఓన్ రిలీజ్ కే వెళ్ళినా 3rd పార్టీ బయర్స్ కొనడంతో ఓవరాల్ వాల్యూ బిజినెస్ మాత్రం సాలిడ్ గానే సొంతం చేసుకుందని చెప్పాలి.

BABY Movie WW Business – సినిమా నైజాంలో…2.25 కోట్ల వాల్యూ బిజినెస్ ను ఆంధ్రలో 2.8 కోట్ల బిజినెస్ ను సీడెడ్ లో 1 కోటి రేంజ్ బిజినెస్ ను సొంతం చేసుకోగా తెలుగు రాష్ట్రాల వాల్యూ బిజినెస్ 6.05 కోట్ల దాకా బిజినెస్ ను అందుకోగా టోటల్ వరల్డ్ వైడ్ గా 7.40 కోట్ల రేంజ్ లో…

బిజినెస్ ను అందుకున్న సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర బ్రేక్ ఈవెన్ ని అందుకోవాలి అంటే 8 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోవాల్సి ఉంటుంది. ఇక సినిమా నైజాంలో 120 థియేటర్స్ లో రిలీజ్ కానుండగా టోటల్ గా తెలుగు రాష్ట్రాల్లో 340 వరకు థియేటర్స్ లో రిలీజ్ కానుంది.

Baby Movie Theaters Count – వరల్డ్ వైడ్ గా సినిమా 500 లోపు థియేటర్స్ లో రిలీజ్ కాబోతుంది. సినిమా మీద మంచి బజ్ ఉండటంతో ఈ బిజినెస్ ను సినిమా హిట్ టాక్ సొంతం చేసుకుంటే అవలీలగా అందుకుని భారీ విజయాన్ని సొంతం చేసుకునే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి ఇప్పుడు.

1 COMMENT

Leave a Reply to Shivamani Cancel reply

Please enter your comment!
Please enter your name here