బాక్స్ ఆఫీస్ దగ్గర పరుగును కంప్లీట్ చేసుకున్న కింగ్ నాగార్జున మరియు నాగ చైతన్య ల కాంబినేషన్ లో ఆడియన్స్ ముందుకు వచ్చిన లేటెస్ట్ మూవీ బంగార్రాజు సినిమా, సంక్రాంతి వీకెండ్ అడ్వాంటేజ్ వలన అద్బుతమైన కలెక్షన్స్ ని సొంతం చేసుకున్నా కానీ తర్వాత స్లో డౌన్ అయిన సినిమా లాంగ్ రన్ ని అయితే సొంతం చేసుకుని ఎలాగోలా రిలీజ్ అయిన 30 వ రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర ఓవరాల్ గా….
బ్రేక్ ఈవెన్ ని పూర్తీ చేసుకుని క్లీన్ హిట్ గా నిలిచింది, తర్వాత బాక్స్ ఆఫీస్ రన్ కంప్లీట్ అవ్వగా, సినిమా పరుగు కంప్లీట్ అయ్యాక బంగార్రాజు ను డిజిటల్ లో రిలీజ్ చేయాలని డిసైడ్ అవ్వగా, సినిమాను నిర్మించిన జీ స్టూడియో వాళ్ళు తమ ప్లాట్ ఫామ్ అయిన…
జీ 5 లో సినిమాను రీసెంట్ గా 18న డిజిటల్ లో రిలీజ్ అయ్యేలా చేశారు…. కాగా సోషల్ మీడియాలో ఛానెల్ లో సాలిడ్ ప్రమోషన్స్ ని చేసిన తర్వాత డిజిటల్ లో రిలీజ్ అయిన బంగార్రాజు సినిమా డిజిటల్ ప్లాట్ ఫామ్ లో ప్రీవియస్ రికార్డులను అన్నీ కూడా బ్రేక్ చేసి….
ఇప్పుడు జీ 5 యాప్ పరంగా హైయెస్ట్ వ్యూవర్ షిప్ ను మొదటి రోజు సొంతం చేసుకున్న సినిమాగా నిలిచిందని రీసెంట్ గా అఫీషియల్ గా అనౌన్స్ చేశారు మేకర్స్….. బాక్స్ ఆఫీస్ దగ్గర దుమ్ము లేపిన ఈ సినిమా డిజిటల్ లో కూడా ఇదే రేంజ్ లో భీభత్సం సృష్టిస్తూ బిగ్గెస్ట్ వ్యూవర్ షిప్ తో దూసుకు పోతూ ఉండటం విశేషం కాగా ఆ నంబర్స్ లెక్క….
ఎంతవరకు ఉంటుంది అన్నది వీకెండ్ తర్వాత అఫీషియల్ గా అనౌన్స్ చేసే అవకాశం ఉందని చెప్పాలి… బాహుబలి తర్వాత సీక్వెల్స్ పరంగా బాక్స్ ఆఫీస్ దగ్గర హిట్ అయిన సినిమాగా బంగార్రాజు నిలవగా ఇప్పుడు డిజిటల్ లో కూడా అద్బుతమైన రెస్పాన్స్ తో దూసుకు పోతున్న ఈ సినిమా లాంగ్ రన్ లో ఇంకా ఎంత దూరం వెళుతుందో చూడాలి.