Home న్యూస్ బంగార్రాజు రివ్యూ…ప్లస్ అండ్ మైనస్ పాయింట్స్!

బంగార్రాజు రివ్యూ…ప్లస్ అండ్ మైనస్ పాయింట్స్!

2

కింగ్ నాగార్జున యువ సామ్రాట్ నాగ చైతన్య ల కాంబినేషన్ లో సోగ్గాడే చిన్ని నాయన సినిమా కి సీక్వెల్ గా కళ్యాణ్ కృష్ణ డైరెక్షన్ లో వచ్చిన లేటెస్ట్ మూవీ బంగార్రాజు బాక్స్ ఆఫీస్ దగ్గర వరల్డ్ వైడ్ గా భారీ లెవల్ లో రిలీజ్ అయింది. ఈ సారి సంక్రాంతి బిగ్గీగా బరిలోకి దిగిన ఈ సినిమా పై అంచనాలు అయితే భారీగా ఉన్నాయి. మరి సినిమా ఎలా ఉంది ఎంతవరకు అంచనాలను…..

అందుకుందో తెలుసుకుందాం పదండీ… ముందుగా కథ పాయింట్ విషయానికి వస్తే…. స్వర్గంలో ఉండే బంగార్రాజు భూమి మీద తన మనవడు పిల్ల బంగార్రాజు ని చూస్తూ ఉంటాడు, కానీ ఓ సమస్య వలన పెద్ద బంగార్రాజు భూమి మీదకి వచ్చి తన మనవడిలో ప్రవేశించాల్సి వస్తుంది…

అసలు ఆ సమస్య ఏంటి, బంగార్రాజు భూమి మీదకి వచ్చిన పని అయ్యిందా లేదా అన్నది మొత్తం మీద సినిమా కథ… కథ పరంగా చెప్పాలి అంటే అసలు ఏమాత్రం కొత్తదనం లేని రొటీన్ అనిపించే స్టొరీ లైన్ అని చెప్పాలి. కథ స్ట్రాంగ్ గా లేక పోవడం బిగ్గెస్ట్ మైనస్ పాయింట్…

కానీ ఇటు నాగ చైతన్య కానీ అటు నాగార్జున కానీ తమ తమ రోల్స్ తో సినిమాను నిలబెట్టారు. ఇద్దరి ఎనర్జీ కానీ స్టైల్ కానీ మాస్ యాటిట్యూడ్ కానీ అదుర్స్ అనిపించే విధంగా ఉండగా నాగ చైతన్య చాలా టైం తర్వాత చేసిన ఈ మాస్ రోల్ తన కెరీర్ కి మరింత హెల్ప్ అవ్వడం ఖాయం. ఇక నాగార్జున తన రోల్ లో దుమ్ము దులిపేశాడు…

ఇక రమ్యకృష్ణకి గాని హీరోయిన్ కృతి శెట్టికి కానీ అంతగా స్కోప్ అయితే లేదు సినిమాలో. మిగిలిన పాత్రలు కూడా జస్ట్ ఓకే అనిపించుకున్నారు… మ్యూజిక్ అండ్ బ్యాగ్రౌండ్ స్కోర్ సినిమా కి బిగ్ ప్లస్ పాయింట్స్ అని చెప్పాలి. పాటలు వినడానికి ఎంత బాగున్నాయి చూడటానికి ఇంకా బాగున్నాయి అని చెప్పాలి. ఇక బ్యాగ్రౌండ్ స్కోర్ కొన్ని సీన్స్ ని ఓ రేంజ్ లో ఎలివేట్ చేసింది…

ఎడిటింగ్ అండ్ స్క్రీన్ ప్లే కొంచం వీక్ గా ఉన్నాయి, కథ బలంగా లేక పోవడం కొన్ని సీన్స్ పేలవంగా ఉండటం కొన్ని చోట్ల నిరాశ పరిచింది, సినిమాటోగ్రఫీ బాగుంది, విలేజ్ బ్యాగ్ డ్రాప్ ను బాగా చూపెట్టారు. ఇక ప్రొడక్షన్ వాల్యూస్ మెప్పించగా డైరెక్షన్ విషయానికి వస్తే కళ్యాణ్ కృష్ణ బంగార్రాజు కి పకడ్బందీ కథని ఎంటర్ టైన్ మెంట్ సీన్స్ ని…

రాసుకోవడంలో విఫలం అయ్యాడు, కానీ అదే టైం లో హీరోలను బాగా ప్రెజెంట్ చేయడం, కొన్ని సీన్స్ ని బాగా తీయడం, క్లైమాక్స్ ముఖ్యంగా అదిరిపోవడం లాంటివి చాలా ఫ్లాస్ ఉన్నప్పటికీ కూడా సినిమాను చివరి వరకు కూర్చుని చూసేలా చేశాయి… కథ విషయంలో మరింత శ్రద్ధ తీసుకుని రన్ టైం తగ్గించి స్క్రీన్ ప్లే మరింత టైట్ గా రాసుకుని ఉంటే….

ఇంకా సాలిడ్ గా ఉండేది… మొత్తం మీద సినిమా హైలెట్స్ విషయానికి వస్తే, నాగార్జున నాగ చైతన్య కలిసి ఉన్న సీన్స్, సాంగ్స్, క్లైమాక్స్ అని చెప్పాలి, మైనస్ పాయింట్స్ విషయానికి వస్తే కథ బలంగా లేక పోవడం, లెంత్ ఎక్కువ అవ్వడం మరియు కథ ప్రిడిక్ట్ చేసేలా ఉండటం లాంటివి అని చెప్పొచ్చు…

మొత్తం మీద సినిమా మరీ అద్బుతం కాదు కానీ సోగ్గాడే చిన్నినాయన సినిమా రేంజ్ కూడా కాకపోయినా కానీ నాగార్జున నాగ చైతన్య పెర్ఫార్మెన్స్ కోసం, సాంగ్స్ కోసం… క్లైమాక్స్ కోసం ఈజీగా ఒకసారి చూడొచ్చు… పండగ టైం లో పెర్ఫెక్ట్ బొమ్మ అని చెప్పొచ్చు. కానీ లెంత్ కొంచం ఎక్కువ ఉండటం లాంటివి బరించాల్సి ఉంటుంది… ఫైనల్ గా సినిమా కి మా రేటింగ్ 2.75 స్టార్స్…

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here