సంక్రాంతి సీజన్ ముగిసింది, సాలిడ్ గా వీక్ మొత్తం అన్ని సినిమాలు వేటి రేంజ్ లో అవి అల్టిమేట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకోగా తర్వాత వర్కింగ్ డేస్ మొదలు అవ్వగా ఈ సారి పాజిటివ్ టాక్ పవర్ చూపుతూ క్రాక్ సినిమా సాలిడ్ గా హోల్డ్ చేసి సంచలనం సృష్టించింది. మిగిలిన సినిమాలు కూడా డీసెంట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకున్నాయి. ఇక మరో వీకెండ్ రాగా ఈ సారి అల్లరి నరేష్ బంగారు బుల్లోడు సినిమా…
బాక్స్ ఆఫీస్ దగ్గర లక్ ని పరీక్షించుకోవడానికి సిద్ధం అవ్వగా అన్ని సినిమాలకు కలిపి రెండు తెలుగు రాష్ట్రాలలో థియేటర్స్ కౌంట్ ని ఎలా ఇచ్చారు అన్నది ఆసక్తిగా మారింది. మొత్తం మీద బంగారు బుల్లోడు రిలీజ్ రోజున టోటల్ గా సంక్రాంతి సినిమాలు అలాగే…
బంగారు బుల్లోడు సినిమాల థియేటర్స్ కౌంట్ ని గమనిస్తే… ముందుగా బంగారు బుల్లోడు సినిమా మొత్తం మీద 420 వరకు థియేటర్స్ లో ఈ రోజు రిలీజ్ ను సొంతం చేసుకోగా, ఆల్ మోస్ట్ రెండో వారం నుండి మూడో వారం లో అడుగు పెడుతున్న క్రాక్ సినిమా ఎట్టకేలకు…
థియేటర్స్ కౌంట్ ని పెంచుకుని 340 వరకు థియేటర్స్ లో రిలీజ్ ను సొంతం చేసుకోబోతుంది, రామ్ నటించిన రెడ్ ది ఫిల్మ్ కి కూడా మంచి థియేటర్స్ దక్కాయి. 270 థియేటర్స్ లో పరుగును కొనసాగిస్తుంది ఈ సినిమా. ఇక డబ్బింగ్ మూవీ మాస్టర్ బాగానే హోల్డ్ చేస్తూ ఉండటం తో ఈ సినిమా కి మొత్తం మీద 250 వరకు థియేటర్స్ దక్కాయి. ఇక బ్రేక్ ఈవెన్ కి కష్టపడుతున్న…
బెల్లంకొండ శ్రీనివాస్ అల్లుడు అదుర్స్ సినిమా కి 220 థియేటర్స్ ఈ వారం దొరికాయి… వీకెండ్ తో పాటు జనవరి 26 హాలిడే లు ఉన్నాయి కాబట్టి వాటిని ఈ సినిమాలు ఎలా వాడుకుంటాయో చూడాలి, మొత్తం మీద క్రాక్ అలాగే కొత్త సినిమా బంగారు బుల్లోడు జోరు చూపే అవకాశం ఉంది. మిగిలిన సినిమాలు కూడా దుమ్ము లేపితే బాక్స్ ఆఫీస్ మరోసారి అన్ని కలిసి షేక్ చేసే అవకాశం ఉంది.