రికార్డుల ఊచకోత కోస్తూ బాక్స్ ఆఫీస్ దగ్గర ఊహకందని రికార్డులను నమోదు చేస్తూ ఇండియన్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఎపిక్ రికార్డ్ ఓపెనింగ్స్ తో లాంగ్ వీకెండ్ ని పూర్తి చేసుకుని హిస్టారికల్ రన్ ను కొనసాగిస్తున్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun) నటించిన లేటెస్ట్ మూవీ పుష్ప2(Pushpa 2 The Rule) సినిమా లాంగ్ వీకెండ్ ని వీర లెవల్ కలెక్షన్స్ తో కంప్లీట్ చేసుకుంది ఇప్పుడు.
సినిమా ఇండియన్ మూవీస్ పరంగా ఇప్పుడు మొదటి 4 రోజుల్లో ఆల్ టైం రికార్డ్ కలెక్షన్స్ ని భారీ మార్జిన్ తో కొత్త రికార్డ్ ను నమోదు చేసింది….ఇండియన్ మూవీస్ పరంగా మొదటి 4 రోజుల్లో ఏ సినిమా కూడా ఊహించని రేంజ్ లో పుష్ప2 మూవీ ఏకంగా 800 కోట్ల ఎపిక్ వసూళ్ళని సొంతం చేసుకుని దుమ్ము లేపింది…
దాంతో ప్రీవియస్ రికార్డ్ ను ఓ రేంజ్ లీడ్ తో బ్రేక్ చేసి సంచలన రికార్డ్ ను నమోదు చేసింది….ఇది వరకు ఇండియన్ మూవీస్ పరంగా మొదటి 4 రోజుల్లో ఎపిక్ ఇండియన్ బ్లాక్ బస్టర్ బాహుబలి2 మూవీ ఆల్ మోస్ట్ 625 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ తో సరికొత్త రికార్డ్ ను నమోదు చేయగా…
తర్వాత టైంలో వచ్చిన మూవీస్ లో ఆర్ ఆర్ ఆర్ మూవీ మొదటి నాలుగు రోజుల్లో ఏకంగా 565 కోట్ల మమ్మోత్ గ్రాస్ మార్క్ ని సొంతం చేసుకోగా తర్వాత వచ్చిన కేజిఎఫ్ చాప్టర్ 2 మూవీ 557.45 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను సాధించింది…ఇక లాస్ట్ ఇయర్ ఆడియన్స్ ముందుకు వచ్చిన…
బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ జవాన్ మూవీ 520 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ ని అందుకోగా ఈ ఇయర్ వచ్చిన ఇండియాస్ బిగ్గెస్ట్ హిట్ అయిన కల్కి మూవీ 507.3 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను సొంతం చేసుకుంది. ఇక ఇప్పుడు అన్ని సినిమాల రికార్డులు అన్నీ కూడా చెల్లాచెదురు చేస్తూ…
బాక్స్ ఆఫీస్ దగ్గర ఊహకందని రేంజ్ లో భీభత్సం సృష్టిస్తూ 4 రోజుల్లో ఏ సినిమా కూడా సాధించని రేంజ్ లో 800 కోట్ల రేంజ్ లో గ్రాస్ వసూళ్ళని అందుకుని చరిత్రలో నిలిచిపోయే రికార్డ్ ను అందుకుంది. ఈ రికార్డ్ ను అప్ కమింగ్ మూవీస్ అందుకోవాలి అంటే తలకిమించిన టార్గెట్ అనే చెప్పాలి….
Haddu paddu undali ra 800 crores okkasari move chosi cheppandi raa