Home న్యూస్ బీస్ట్ ఫస్ట్ డే ఓపెనింగ్స్ రిపోర్ట్….విజయ్ మాస్ భీభత్సం!!

బీస్ట్ ఫస్ట్ డే ఓపెనింగ్స్ రిపోర్ట్….విజయ్ మాస్ భీభత్సం!!

0

కోలివుడ్ టాప్ హీరో దళపతి విజయ్ నటించిన లేటెస్ట్ మూవీ బీస్ట్ బాక్స్ ఆఫీస్ దగ్గర సెన్సేషన్ అనిపించే రేంజ్ లో ఓపెనింగ్స్ ని సొంతం చేసుకుంటూ దూసుకు పోతుంది. తెలుగు రాష్ట్రాలలో బీస్ట్ మీద మరీ మాస్టర్ సినిమా రేంజ్ లో బజ్ క్రియేట్ అవ్వలేదు కానీ ఇక్కడ కూడా మరీ మాస్టర్ రేంజ్ లో కాకున్నా కానీ ఆ సినిమా తర్వాత ప్లేస్ లో సినిమా ఓపెనింగ్స్ ఉన్నాయి అని చెప్పాలి…

మొత్తం మీద తెలుగు లో మార్నింగ్ అండ్ మ్యాట్నీ షోలకు సూపర్ ఆక్యుపెన్సీ ఉందని చెప్పాలి. ఇక ఈవినింగ్ అండ్ నైట్ షోల బుకింగ్స్ కూడా బాగానే కొనసాగుతున్నాయి కానీ అవి మాస్టర్ మూవీతో పోల్చితే 60% వరకు ఉన్నాయి అని చెప్పాలి… దాంతో తెలుగు లో సినిమా…

ప్రజెంట్ ట్రెండ్ అండ్ బుకింగ్స్ ని బట్టి 3 కోట్ల రేంజ్ లో ఓపెనింగ్స్ ని అందుకునే అవకాశం కనిపిస్తూ ఉండగా ఈవినింగ్ అండ్ నైట్ షోలు బాగా పెర్ఫార్మ్ చేస్తే 3.3 కోట్ల నుండి 3.5 కోట్ల దాకా వెళ్ళే అవకాశం ఉంది. ఇక తమిళనాడులో ఫస్ట్ డే బుకింగ్స్ ఆల్ మోస్ట్ జరిగిపోయాయి అని చెప్పాలి..

ఆ రేంజ్ లో సినిమా బుకింగ్స్ అక్కడ దుమ్ము లేపగా సినిమా తమిళనాడు లో మొదటి రోజు 30 కోట్ల రేంజ్ గ్రాస్ ఓపెనింగ్స్ కన్ఫాం అని చెప్పొచ్చు. అంతకుమించి ఎంత వరకు ముందుకు వెళుతుంది అన్నది ఈవినింగ్ అండ్ నైట్ షోల ట్రెండ్ ని బట్టి ఉంటుంది. ఇక కేరళలో సినిమా 5 కోట్ల కి తగ్గని గ్రాస్ ఓపెనింగ్స్ ని అందుకునే అవకాశం ఉండగా కర్ణాటకలో కూడా 4.5 కోట్ల రేంజ్ లో ఓపెనింగ్స్ ని అందుకునే అవకాశం కనిపిస్తుంది..

మొత్తం మీద ఇండియా లో మొదటి రోజు ఓపెనింగ్స్ ని బట్టి చూస్తుంటే 48 కోట్ల నుండి 50 కోట్ల రేంజ్ లో గ్రాస్ ఓపెనింగ్స్ ని మినిమమ్ అందుకునే అవకాశం ఉండగా ఓవర్సీస్ కలెక్షన్స్ తో 70 కోట్ల మార్క్ ని సినిమా సొంతం చేసుకునే అవకాశం ఉంది. ఇది నిజంగానే సెన్సేషనల్ ఓపెనింగ్స్ అని చెప్పాలి. ఇక డే ఎండ్ అయ్యే టైం కి సినిమా ఇదే రేంజ్ లో ఉంటుందా లేక ఇంకా గ్రోత్ ని చూపిస్తుందో చూడాలి ఇక…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here