Home న్యూస్ బీస్ట్ రివ్యూ…ప్లస్ అండ్ మైనస్ పాయింట్స్!!

బీస్ట్ రివ్యూ…ప్లస్ అండ్ మైనస్ పాయింట్స్!!

0

కోలివుడ్ టాప్ హీరో దళపతి విజయ్ నటించిన లేటెస్ట్ మూవీ బీస్ట్ వరల్డ్ వైడ్ గా భారీ లెవల్ లో రిలీజ్ అవ్వగా సినిమా పై అంచనాలు సాలిడ్ గా ఉండగా ఆ అంచనాలను సినిమా ఎంతవరకు అందుకుంటుంది అన్నది ఆసక్తిగా మారింది… సినిమా తమిళ్ తో పాటు తెలుగు లో కూడా భారీ రిలీజ్ ను సొంతం చేసుకుంది…. మొత్తం మీద సినిమా ఆడియన్స్ అంచనాలను అందుకుందో లేదో తెలుసుకుందాం పదండీ…

ముందుగా స్టొరీ పాయింట్ విషయానికి వస్తే ఓ టెర్రరిస్ట్ ను పట్టుకునే క్రమంలో హీరో ఓ రిస్కీ ఆపరేషన్ లో పాల్గొనగా ఆ టెర్రరిస్ట్ ను పట్టుకున్నా ఓ బాబు చనిపోవడం హీరోని కలచి వేస్తుంది… కొన్ని నెలలు గడచిన తర్వాత చెన్నై లోని ఓ మాల్ ని టెర్రరిస్ట్ గ్యాంగ్ హైజాక్ చేస్తారు….

ప్రభుత్వం వాళ్ళతో చర్చలు ఒక పక్క జరుపుతూ ఉన్నా రా ఏజెంట్ అయిన హీరో కూడా ఆ మాల్ లోనే ఉన్నాడు అని తెలుసుకుంటారు… ఇక ఆ మాల్ లో ఆ టెర్రరిస్ట్ లను హీరో ఎలా ఓ ఆట ఆదుకున్నాడు అన్నది మిగిలిన స్టొరీ….స్టొరీ పాయింట్ చాలా సింపుల్ గా ఉండటంతో…

స్క్రీన్ ప్లే తోనే నెట్టుకు రావాల్సిన పరిస్థితి ఏర్పడినా అక్కడక్కడా కొన్ని కామెడీ సీన్స్ వర్కౌట్ అయినా కానీ ఎక్కడా కూడా సినిమా ఎంగేజింగ్ గా అయితే అనిపించలేదు… విజయ్ తన రోల్ వరకు అదరగొట్టేశాడు, యాక్షన్ సీన్స్ కొంచం ఓవర్ ది టాప్ కి వెళ్లి చేసినట్లు అనిపించినా అవి కూడా ఆకట్టుకుంటాయి…. హీరోయిజం ఎలివేట్ సీన్స్ కూడా బాగున్నాయి…

ఇక పూజా జస్ట్ ఒక సాంగ్ లో అలా మెరిసి మిగిలిన సీన్స్ లో గెస్ట్ అప్పియరెన్స్ ఇస్తుంది… అనిరుద్ అందించిన సంగీతం అండ్ బ్యాగ్రౌండ్ స్కోర్ సినిమా కి బిగ్ ప్లస్ పాయింట్స్….వీక్ సీన్స్ ని కూడా తన బిజిఎమ్ తో లేపాడు అనిరుద్… ఎడిటింగ్ అండ్ స్క్రీన్ ప్లే చాలా వీక్ గా ఉన్నాయి… ఫస్టాఫ్ వరకు పర్వాలేదు కానీ సెకెండ్ ఆఫ్ సహనానికి పరీక్ష పెడుతుంది అని చెప్పాలి…

ఇక ప్రొడక్షన్ వాల్యూస్ ఆకట్టుకున్నా నెల్సన్ డైరెక్షన్ లో వీకేస్ట్ మూవీ అని చెప్పొచ్చు బీస్ట్ ని…. అసలు కథ బలంగా లేక పోవడం సీన్స్ ఓవర్ ది టాప్ లో ఉండటం, సెకెండ్ ఆఫ్ కంప్లీట్ గా ట్రాక్ తప్పడం, క్లైమాక్స్ ఏమాత్రం థ్రిల్ చేయలేక పోవడం ఇలా మైనస్ పాయింట్స్ చాలానే ఉన్నాయి అని చెప్పాలి…

ఉన్నంతలో విజయ్ పెర్ఫార్మెన్స్, అక్కడక్కడా వచ్చే కామెడీ బిట్స్, అరబిక్ కుతు సాంగ్ మరియు కొన్ని యాక్షన్ సీన్స్ బాగున్నాయి అని చెప్పాలి. మొత్తం మీద సినిమా ఫస్టాఫ్ పర్వాలేదు అనిపించినా కానీ సెకెండ్ ఆఫ్ మాత్రం నిరాశపరిచింది అని చెప్పాలి. ఫ్యాన్స్ కి అయితే పర్వాలేదు అనిపించ వచ్చు కానీ…

రెగ్యులర్ ఆడియన్స్ కి హైజాక్ నేపధ్యంలో ఎన్నో వెబ్ సిరీస్ లు ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి, వాటికి మించిన గొప్ప ఎలిమెంట్స్ అంటూ ఏమి లేవు ఈ బీస్ట్ మూవీ లో అని చెప్పాలి. మొత్తం మీద ఎలాంటి అంచనాలు లేకుండా థియేటర్స్ కి వెళ్ళే ఆడియన్స్ కొంచం కష్టపడ్డా ఒక సారి చూడొచ్చు అనిపిస్తుంది బీస్ట్ మూవీ… సినిమా కి మా ఫైనల్ రేటింగ్ 2.25 స్టార్స్…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here