Home న్యూస్ ఒక్క రోజు 1000 షోలు…అరాచకం అసలు

ఒక్క రోజు 1000 షోలు…అరాచకం అసలు

172
0

  సూపర్ స్టార్ రజినీకాంత్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రోబో 2.0 బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి రోజు రికార్డుల వర్షం కురిపించడానికి సిద్ధం అవుతుంది. కాగా సినిమా రెండు తెలుగు రాష్ట్రాలలో భారీ గా రిలీజ్ కానుండగా పక్క రాష్ట్రం కర్ణాటక లో కూడా రికార్డ్ లెవల్ లో అడ్వాన్స్ బుకింగ్స్ తో జోరు చూపుతున్న ఈ సినిమా అక్కడ కూడా భారీ ఎత్తున రిలీజ్ అవుతుంది. అందునా ఒక్క బెంగుళూరు ఏరియ లోనే ఈ సినిమా..

మొదటి రోజు కి గాను అన్ని వర్షన్స్ కలుపుకుని 1000 వరకు షోల ని సొంతం చేసుకుందట. ఇది అక్కడ ఆల్ టైం హిస్టారికల్ రికార్డ్ అనే చెప్పాలి. ఇక టోటల్ కర్ణాటక లో ఈ సినిమా సుమారు 380 కి పైగా థియేటర్స్ లో రిలీజ్ కాబోతున్నట్లు సమాచారం.

అడ్వాన్స్ బుకింగ్స్ ఓ రేంజ్ లో జరుగుతుండటం తో తొలిరోజు ఇక్కడ రికార్డ్ బ్రేకింగ్ వసూళ్లు సినిమా సాధించడం ఖాయమని ట్రేడ్ విశ్లేషకులు భావిస్తున్నారు. ఏమాత్రం టాక్ పాజిటివ్ గా వచ్చినా సినిమా సాధించే ఊచకోత మరో రేంజ్ లో ఉండే అవకాశం ఉందని చెబుతున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here