Home న్యూస్ బెస్ట్ సీన్ ఆఫ్ 2018 ఇయర్ లో ఇదొకటి!!

బెస్ట్ సీన్ ఆఫ్ 2018 ఇయర్ లో ఇదొకటి!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర అరవింద సమేత 4 వ రోజు మొదటి రెండు షోలు ముగిసే లోపే 100 కోట్ల గ్రాస్ మార్క్ ని అందుకున్న నేపధ్యంలో ప్రొడక్షన్ టీం నుండి అఫీషియల్ పోస్టర్ వచ్చింది…ఆ పోస్టర్ లో 100 కోట్ల గ్రాస్ ని వీకెండ్ లో అందుకుందని కంఫామ్ చేయగా…

ఆ పోస్టర్ సీన్ కి థియేటర్ లో వచ్చిన రెస్పాన్స్ గురించి మాట్లాడుకుంటే…ఈ ఇయర్ వచ్చిన బెస్ట్ సీన్స్ లో ఇదొకటి అని చెప్పొచ్చు…ఫాక్షన్ మూవీస్ అంటే తొడలు కొట్టడం అనేది కామన్…కానీ ఈ సారి సరికొత్తగా త్రివిక్రమ్ శ్రీనివాస్…కత్తికి అంటిన రక్తాన్ని తొడ పై రాసే సీన్ పెట్టాడు.

ఆ సీన్ కి థియేటర్స్ లో వస్తున్న రెస్పాన్స్ అయితే పీక్స్ అని చెప్పొచ్చు. ఈ ఇయర్ వచ్చిన సినిమాల్లో రంగస్థలంలో రామ్ చరణ్ మీసం మేలేసే సీన్ కి, భరత్ అనే నేను లో హెలికాప్టర్ దిగే సీన్ కి ఇదే రేంజ్ లో రెస్పాన్స్ దక్కింది…ఇప్పుడు అరవింద సమేత లో కూడా ఈ సీన్ కి రెస్పాన్స్ మాస్ తో పాటు క్లాస్ లో కూడా అల్టిమేట్ లెవల్ లో ఉందని చెప్పొచ్చు…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here