Home న్యూస్ కార్తీ ఖైదీ రివ్యూ…ప్లస్ అండ్ మైనస్ పాయింట్స్!!

కార్తీ ఖైదీ రివ్యూ…ప్లస్ అండ్ మైనస్ పాయింట్స్!!

0

      కోలివుడ్ తో పాటు టాలీవుడ్ లో కూడా మంచి క్రేజ్ ఉన్న తమిళ్ హీరోలలో కార్తీ కూడా ఒకరు… రీసెంట్ టైం లో ఇక్కడ కూడా ఖాకీ చినబాబు సినిమాలతో మంచి కలెక్షన్స్ ని సాధించిన కార్తీ ఈ ఇయర్ మొదట్లో దేవ్ అనే డిసాస్టర్ సినిమా తర్వాత డిఫెరెంట్ ఎక్స్ పెరి మెంటల్ మూవీ అయిన ఖైదీ సినిమా తో నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చేశాడు. వరల్డ్ వైడ్ గా 1500 స్క్రీన్స్ లో రిలీజ్ అయిన సినిమా ఎలా ఉందో తెలుసుకుందాం పదండీ..

ముందుగా స్టొరీ పాయింట్ విషయానికి వస్తే యావజ్జీవ ఖైదీ అయిన హీరో జైలు నుండి పారిపోతాడు… అదే సమయం లో ఒక ముటా తాలూకు 800 కోట్ల సరుకు ని పోలీసులు దగ్గర ఉండగా ఆ పోలీసులను చంపి ఆ సరుకు తెచ్చుకోవాలి విలన్ చూస్తాడు..

దాంతో తప్పించుకున్న హీరో పోలీసులకు చిక్కినా వాళ్లకి హెల్ప్ చేయాలనీ డిసైడ్ అవుతాడు. మరి తర్వాత ఏం జరిగింది, అసలు హీరో ఎందుకు జైలుకు వెళ్ళాడు, ఎందుకు తప్పించుకున్నాడు, పోలీసులను తనని చుట్టుముట్టిన గుండాలను ఎదిరించి బ్రతికాడా లేదా అన్నది ఓవరాల్ సినిమా కథ…

కథ దాదాపుగా ఇదే అయినా మొత్తం చెప్పినా సినిమా చూస్తున్న సమయం లో ఇవేవి గుర్తుకు రావు, తర్వాత సీన్ ఏం అవుతుందా అన్న ఆసక్తి సినిమా ఆద్యంతం కొనసాగుతుంది, కేవలం 4 గంటల సమయం లో జరిగే కథ నేపధ్యమే సినిమా అయినా 2 గంటల 20 నిమిషాలకు పైగా లెంత్ ఉన్నా కానీ….

ఆద్యంతం సినిమా ఆకట్టుకుని స్క్రీన్ ప్లే తో మ్యాజిక్ చేస్తూ కార్తీ హీరోయిజం తో మెప్పిస్తూ రా అండ్ ఇంటెన్స్ సీన్స్ తో అలరిస్తుంది. కానీ ఇది అన్ని సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ కి కాదు, ఇలాంటి డిఫెరెంట్ కాన్సెప్ట్ మూవీస్ ని ఇష్టపడే వారికి, ఎక్స్ పెరిమెంటల్ మూవీస్ చూసే వారు ఎక్కువగా నచ్చే అవకాశం ఉంది.

ఇక రొటీన్ మూవీ లు చూసే వాళ్లకి సినిమా ఒకసారి చూడొచ్చు అనిపిస్తుంది. ఓవరాల్ గా పెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే కార్తీ అదరగొట్టేశాడు, తన నటన, డైలాగ్స్ ఫైట్స్ లో హీరోయిజం అన్నీ ఆకట్టుకోగా మిగిలిన పాత్రలు కూడా ఉన్నంతలో మెప్పిస్తాయి.

సంగీతం సినిమా లో లేకున్నా బ్యాగ్రౌండ్ స్కోర్ అదిరిపోయింది, ఇక స్క్రీన్ ప్లే అండ్ ఎడిటింగ్ కూడా సాలిడ్ గా ఉండగా లెంత్ కొంచం ఎక్కువ అయిన ఫీలింగ్ కలిగినా ఓవరాల్ గా సినిమా ఆద్యంతం ఆకట్టుకునేలానే ఉంది. ఇక లొకేషన్ కనగరాజ్ డైరెక్షన్ అద్బుతంగా ఉందని చెప్పొచ్చు.

సినిమా కాన్సెప్ట్ డిఫెరెంట్ గా ఉండటం తో ఇది కామన్ ఆడియన్స్ కి ఎంతవరకు నచ్చుతుందో చెప్పలేం, కానీ డిఫెరెంట్ మూవీస్ ని ఇలాంటి రా సబ్జేట్స్ ని చూడాలి అనుకున్న వాళ్ళకి ఖైదీ సినిమా ఓ రేంజ్ లో నచ్చుతుంది. సినిమాకి ఫైనల్ గా మేం ఇస్తున్న రేటింగ్ 3 స్టార్స్…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here