బాక్స్ ఆఫీస్ దగ్గర బ్రహ్మాస్త్ర సినిమా రెండు వారాలను కంప్లీట్ చేసుకుని మూడో వారంలో అడుగు పెట్టగా సినిమాకి 15వ రోజు నేషనల్ సినిమా డే అడ్వాంటేజ్ లభించడంతో ఎక్స్ లెంట్ ఫుట్ ఫాల్స్ లభించింది, ఆల్ మోస్ట్ రిలీజ్ రోజును తలపించే రేంజ్ లో జనాలు థియేటర్స్ కి ఎగబడి సినిమాను చూశారు. దాంతో సెన్సేషనల్ కలెక్షన్స్ ని సొంతం చేసుకున్న సినిమా ఇప్పుడు బాలీవుడ్ హిస్టరీ లోనే ఏకంగా…
బాహుబలి 2 తర్వాత సెకెండ్ హైయెస్ట్ నెట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకున్న సినిమాగా నిలిచి దుమ్ము దుమారం లేపడం విశేషం అని చెప్పాలి. సినిమా కి 15వ రోజు ఆల్ మోస్ట్ 14 లక్షల రేంజ్ లో టికెట్స్ టోటల్ ఇండియా లో సేల్ అయ్యాయని సమాచారం.
కాగా ఓవరాల్ గా 15వ రోజు నెట్ కలెక్షన్స్ 9 కోట్ల రేంజ్ కి చేరువ అయ్యే లెవల్ లో ఉందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. దాంతో బాహుబలి2 తర్వాత 15వ రోజు హైయెస్ట్ కలెక్షన్స్ ని అందుకున్న రెండో సినిమాగా నిలిచింది బ్రహ్మాస్త్ర సినిమా…
బాహుబలి2 సినిమా 15వ రోజు 10.05 కోట్ల నెట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుంది. బ్రహ్మాస్త్ర సినిమా ఇప్పుడు 9 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్స్ ని అందుకుంది, కానీ ఫుట్ ఫాల్స్ మాత్రం బ్రహ్మాస్త్రవే 15వ రోజు ఎక్కువ ఉన్నాయి. సినిమా ఈ రేంజ్ లో దుమ్ము లేపడం ఇప్పుడు టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది.