విక్టరీ వెంకటేష్ నాగ చైతన్య ల కాంబినేషన్ లో తెరకెక్కుతున్న మల్టీ స్టారర్ మూవీ వెంకీ మామ బాక్స్ ఆఫీస్ దగ్గర సందడి చేయడానికి సిద్ధం అవుతుంది, సినిమా అఫీషియల్ ట్రైలర్ రీసెంట్ గా రిలీజ్ అవ్వగా సినిమా పై మరింతగా పెరిగి పోయింది, దాంతో భారీ ఎత్తున రిలీజ్ చేయడానికి సన్నాహాలు మొదలు పెట్టగా సినిమా బిజినెస్ కూడా అన్ని సెంటర్స్ లో సాలిడ్ గా జరిగి దుమ్ము లేపింది…
ఇటు వెంకీ ఎఫ్ 2 మల్టీస్టారర్ తో బ్లాక్ బస్టర్ కొట్టగా అటు నాగ చైతన్య మజిలీ తో కెరీర్ బెస్ట్ కొట్టాడు, ఇటు డైరెక్టర్ బాబీ కూడా జై లవ కుశ తో తన కెరీర్ బెస్ట్ ని అందుకోగా ఇప్పుడు ఈ ముగ్గురి కాంబో లో వస్తున్న సినిమా అవ్వడంతో వెంకీ మామ బిజినెస్ జోరు అందుకుంది.
ఓవరాల్ గా సినిమా సాధించిన ప్రీ రిలీజ్ బిజినెస్ ని గమనిస్తే
?Nizam: 7.50Cr
?Ceeded: 5.40Cr
?UA: 3.60Cr
?East: 2.40Cr
?West: 2Cr
?Guntur: 3Cr
?Krishna: 2.40Cr
?Nellore: 1.30Cr
AP-TG Total:- 27.60Cr
Ka & ROI: 2.70Cr
OS: 2.80Cr
Total WW: 33.10CR
ఇదీ మొత్తం మీద సినిమా సినిమా సాధించిన బిజినెస్, ఇది కాకుండా కొన్ని చోట్ల సినిమా ను నిర్మాతలు ఓన్ గా రిలీజ్ చేస్తున్నారు. ఆ బిజినెస్ వర్త్ సుమారు 3 కోట్ల దాకా ఉంటుందని అంచనా. ఓన్ రిలీజ్ కాబట్టి ఆ బిజినెస్ ని పక్కకు పెట్టి ఈ బిజినెస్ ఫైనల్ అవ్వగా… ఇప్పుడు బాక్స్ ఆఫీస్ దగ్గర…
సినిమా బ్రేక్ ఈవెన్ అవ్వాలి అంటే 34 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోవాల్సిన అవసరం ఉంది, సినిమా పై ఉన్న క్రేజ్ దృశ్యా పాజిటివ్ టాక్ వస్తే ఈ మార్క్ ని అందుకోవడం పెద్ద కష్టం కాదు కానీ సినిమా కి ఉన్న బజ్ దృశ్యా ఇది మల్టీ స్టారర్ కూడా అవ్వడంతో బాక్స్ ఆఫీస్ దగ్గర మరింత గట్టిగా కలెక్షన్స్ ని అందుకోవాల్సి ఉంటుంది.