నట సింహం నందమూరి బాలకృష్ణ నటించిన లేటెస్ట్ మూవీ ఎన్టీఆర్ కథానాయకుడు బాక్స్ ఆఫీస్ దగ్గర రీసెంట్ గా రిలీజ్ అయ్యి మంచి టాక్ ని సొంతం చేసుకున్నా కానీ బాక్స్ ఆఫీస్ రన్ లో ఏమాత్రం జోరు చూపులేక చతికిల బడి భారీ పరాజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. 70.5 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ కి అతి కష్టం మీద 20.4 కోట్ల లోపు షేర్ ని మాత్రమె అందుకుని ఏకంగా 50.1 కోట్ల లాస్ ని సొంతం చేసుకుంది.
దాంతో రెండో పార్ట్ పై భారీ ప్రెజర్ పడగా ముందుగా రెండో పార్ట్ ని ఫ్రీ గా ఇచ్చేస్తున్నారు అన్న టాక్ వినిపించగా తర్వాత మళ్ళీ ఎలాంటి ఫ్రీ లేదని సినిమాను కొత్త బయ్యర్ల కి అమ్ముతున్నారని అన్న వార్తలు చక్కర్లు కొట్టాయి. కాగా తర్వాత నిర్మాతల నుండి అఫీషియల్…
అనౌన్స్ మెంట్ దీని పై వచ్చేసింది. ఆ లెక్క ప్రకారం మొదటి పార్ట్ నష్టాల్లో 35% రిటర్న్ ఇచ్చేస్తామని, తర్వాత రెండో పార్ట్ రిలీజ్ అయిన తర్వాత వచ్చిన కలెక్షన్స్ లో మరోసారి 40% వరకు రిటర్న్ ఇచ్చేస్తామని హామీ ఇచ్చినట్లు చెప్పడం తో అందరు సంతోషంగా ఉన్నారు.
అది కొంచం విశ్లేషిస్తే… ఇప్పుడు ఓవరాల్ లాస్ కోట్లు అవ్వడం తో అందులో 35% రిటర్న్ ఇవ్వనున్నారు. అంటే సుమారు 17.5 కోట్ల వరకు రిటర్న్ వెళ్లనుంది… దాంతో రెండో పార్ట్ బిజినెస్ టార్గెట్ ఇప్పుడు 32.6 కోట్ల దాకా అవుతుందని సమాచారం. ఒకవేళ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 40 కోట్ల వరకు కలెక్ట్ చేస్తే…అందులో నుండి 40% అంటే 16 కోట్లు బయ్యర్లకి వెళుతుంది..
ఓవరాల్ గా సినిమా లాంగ్ రన్ లో ఎంత ఎక్కువ వసూల్ చేస్తే అంత ఎక్కువ మొత్తం బయ్యర్ల కి వెళుతుంది. దాంతో బాలయ్య నిర్ణయం తో అందరు తనని శెభాష్ అంటూ మెచ్చుకుంటున్నారు. ఇక సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ గా దంచికొట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. న్యూస్ అప్ డేట్స్ కోసం బెల్ ఐకాన్ ని ప్రెస్ చేసి సబ్ స్బైబ్ చేసుకోండి.. అప్ డేట్ రాగానే నోటిఫికేషన్ మీకు అందుతుంది.