బాక్స్ ఆఫీస్ దగ్గర అల్టిమేట్ రికార్డులతో దుమ్ము దుమారం లేపుతూ అన్ సీజన్ లో ఎవ్వరూ ఊహించని రేంజ్ లో వసూళ్ళ ప్రభంజనం సృష్టిస్తూ దూసుకు పోతున్న విక్కీ కౌశల్(Vicky Kaushal) నటించిన లేటెస్ట్ మూవీ ఛావా(Chhaava Telugu) సినిమా…హిస్టారికల్ జానర్ లో ఆల్ టైం ఎపిక్ రికార్డులను నమోదు చేయగా…
సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర రిమార్కబుల్ కలెక్షన్స్ తో 550 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్స్ ని హిందీ లో అందుకోగా తెలుగు లో సైతం సెన్సేషనల్ కలెక్షన్స్ ని సాధించింది. ఈ క్రమంలో సినిమా బాలీవుడ్ తరుపున ఇప్పుడు మరో బిగ్ రికార్డ్ ను సైతం నమోదు చేయడం విశేషం అని చెప్పాలి.
బుక్ మై షో లో టికెట్ సేల్స్ ను అప్ డేట్ చేయడం మొదలు పెట్టిన తర్వాత బాలీవుడ్ సినిమాల పరంగా ఆల్ టైం హైయెస్ట్ టికెట్ సేల్స్ రికార్డ్ ను కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్(Shah Rukh Khan) నటించిన జవాన్(Jawan Movie) సొంతం చేసుకుంది…
ఆల్ మోస్ట్ 12 మిలియన్స్ కి పైగా టికెట్ సేల్స్ ను సొంతం చేసుకుని జవాన్ సంచలనం సృష్టించగా….తర్వాత వచ్చిన మూవీస్ లో స్త్రీ2 ఒక్కటి 11.14 మిలియన్స్ వరకు టికెట్ సేల్స్ తో చేరువగా వచ్చినా కూడా జవాన్ ని క్రాస్ చేయలేదు.
కానీ బాక్స్ ఆఫీస్ దగ్గర ఫిబ్రవరి లాంటి అన్ సీజన్ లో రిలీజ్ అయిన ఛావా సినిమా ఏకంగా 12.01 మిలియన్స్ వరకు టికెట్ సేల్స్ ను సొంతం చేసుకుని జవాన్ ని దాటేసి హిందీ సినిమాల పరంగా ఆల్ టైం హైయెస్ట్ టికెట్ సేల్స్ ను సొంతం చేసుకుని కొత్త రికార్డ్ ను నమోదు చేసింది.