టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న సెన్సేషనల్ మూవీ సైరా నరసింహా రెడ్డి అత్యంత భారీ ఎత్తున రిలీజ్ అవ్వడానికి కొన్ని గంటల సమయం మాత్రమె ఉంది. తెలుగు చరిత్ర లో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ బడ్జెట్ తో రూపొందిన సినిమాల్లో ఒకటిగా నిలిచిన సైరా నరసింహా రెడ్డి బాక్స్ ఆఫీస్ దగ్గర అత్యంత భారీ ఎత్తున అక్టోబర్ 2 న రిలీజ్ కానుండగా సినిమా కి అన్ని చోట్లా క్రేజ్ పీక్స్ కి వెళుతుంది అని చెప్పాలి.
ఇతర భాషల్లో మరీ అనుకున్న రేంజ్ లో క్రేజ్ ఇప్పుడిప్పుడే ఏర్పడుతుండగా సినిమా కి స్లో స్టార్ట్ దక్కుతుంది అనుకున్న తమిళ్ లో సినిమా ను సూపర్ గుడ్ ఫిలిమ్స్ వాళ్ళు ఎక్స్ లెంట్ గా ప్రమోట్ చేస్తున్నారు. కాగా మెయిన్ సెంటర్ అయిన చెన్నై లో…..
ఇప్పటి వరకు ఏ తెలుగు సినిమా కి దక్కన్నని స్పెషల్ షోలు ఇప్పుడు సైరా కి దక్కనున్నాయి. అక్కడ ఇది వరకు బాహుబలి కి 30 రేంజ్ లో స్పైడర్ కి 20 రేంజ్ లో, సాహో కూడా 20 రేంజ్ లో స్పెషల్ షోలు పడ్డట్లు సమాచారం. కానీ సైరా విషయానికి వచ్చే సరికి ఏకంగా…
50 కి పైగా స్పెషల్ షోలు వేస్తున్నారట. ఒక్క చెన్నై లోనే ఈ రేంజ్ లో షోలు పడుతుండటం విశేషం అనే చెప్పాలి. పోటి గట్టిగానే ఉన్నా తమిళనాడు లో సినిమా సుమారు గా 370 కి పైగా థియేటర్స్ లో రిలీజ్ అవ్వడానికి సిద్ధం అవుతుంది. దాంతో అక్కడ బాక్స్ ఆఫీస్ దగ్గర… సినిమాకి…
ఎలాంటి ఓపెనింగ్స్ లభిస్తాయి అనేది ఆసక్తిగా మారింది. లోకల్ స్టార్ విజయ్ సేతుపతి కూడా ఉండటం తో సినిమా కి అనుకున్న రేంజ్ కి మించి షోలు దక్కాయని చెప్పొచ్చు. మొత్తం మీద ఇప్పుడు బాక్స్ ఆఫీస్ దగ్గర కూడా ఇలాంటి రికార్డులే సినిమా నమోదు చేయాలని అందరు కోరుకుంటున్నారు.