Home గాసిప్స్ షాకింగ్: ఆల్ రెడీ తెలుగు లో రిలీజ్ అయిన మరో సినిమా రీమేక్ లో చిరు?

షాకింగ్: ఆల్ రెడీ తెలుగు లో రిలీజ్ అయిన మరో సినిమా రీమేక్ లో చిరు?

0

ఆల్ రెడీ ఒక భాషలో హిట్ అయిన సినిమాను మరో భాషలో రీమేక్ చేయడం ఒక పద్దతి, ఒక భాషలో తెరకెక్కుతున్న సినిమా బాగా వస్తుంది అనిపించి మరో భాషలో హక్కులు సొంతం చేసుకుని రీమేక్ చేయడం మరో పద్దతి, వీటితో పాటు రీసెంట్ గా టాలీవుడ్ లో మరో పద్దతి కూడా మొదలైంది, ఆల్ రెడీ తెలుగు లో డబ్ అయిన డబ్బింగ్ సినిమాలను రీమేక్ చేసి కొత్త ట్రెండ్ ని సృష్టిస్తున్నారు.

అజిత్ నటించిన వీరం సినిమాను పవన్ కళ్యాణ్ కాటమరాయుడు పేరు తో రీమేక్ చేయగా మెగాస్టార్ చిరంజీవి ఇప్పుడు లూసిఫర్ డబ్బింగ్ వర్షన్ ని తెలుగు లో మళ్ళీ రీమేక్ చేస్తుండగా ఇప్పుడు మరో సినిమా పై కూడా దృష్టి పెట్టారని, త్వరలోనే ఈ సినిమా కూడా….

మెగాస్టార్ అప్ కమింగ్ రీమేక్ లిస్టులో నిలిచే అవకాశం ఉందని అంటున్నారు, ఆ వార్తల ప్రకారం 5 ఏళ్ల క్రితం తమిళ్ అండ్ తెలుగు లో రిలీజ్ అయిన అజిత్ నటించిన ‘ఎన్నై అరిందాల్’ సినిమా తెలుగు లో ఎంతవాడు గాని పేరుతో రీమేక్ అయ్యి బాగానే కలెక్షన్స్ ని కూడా సాధించింది.

కాగా ఈ సినిమా పై మెగాస్టార్ మనసు పడిందని, రీమేక్ చేస్తే బాగుంటుంది అన్న ఆలోచన చేస్తున్నారని ఇప్పుడు లేటెస్ట్ టాక్, మెగాస్టార్ ఇప్పటికే లూసిఫర్ రీమేక్ ని వినాయక్ తో, వేదాలం రీమేక్ ని మెహర్ రమేష్ తో రీమేక్ చేస్తున్న విషయం తెలిసిందే. వీటి తర్వాత ఈ రీమేక్ ని పట్టాలు ఎక్కిస్తే ఎలా ఉంటుంది అన్న ఆలోచన చేస్తున్నారట.

ఆల్ రెడీ తెలుగు లో డబ్ అయ్యి రిలీజ్ అయిన సినిమాలను రీమేక్ చేయడం అన్నది రీసెంట్ గానే మొదలు అయింది, పవన్ పునాది వేయగా ఇప్పుడు మెగాస్టార్ నెక్స్ట్ స్టెప్ కి వెళ్ళేలా చేస్తున్నాడని చెప్పొచ్చు. ఈ లెక్కలో అప్పట్లో తెరీ సినిమా తెలుగు డబ్ పోలీసోడుని కూడా రీమేక్ కి ట్రై చేసి ఆపారు, అది కూడా మళ్ళీ పట్టాలు ఎక్కినా ఆశ్యర్యపోనవసరం లేదు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here