Home గాసిప్స్ ఇది షాకింగే….ఇద్దరికీ యుద్దమే అంట!!

ఇది షాకింగే….ఇద్దరికీ యుద్దమే అంట!!

0

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి బ్లాక్ బస్టర్ డైరెక్టర్ కొరటాల శివ ల కాంబినేషన్ లో వస్తున్న అప్ కమింగ్ మూవీ ఆచార్య పై మంచి అంచనాలు ఉన్నాయి. ఎప్పుడో షూటింగ్ మొదలైన ఈ సినిమా లాక్ డౌన్ వలన లుక్ టెస్టులు ఇతర పరిస్థితుల వలన షూటింగ్ ఎప్పటి కప్పుడు డిలే అవుతూనే ఉంది, తక్కువ టైం లో సినిమా తీయాలి అనుకున్నా కానీ… పరిస్థితుల వలన డిలే ఎప్పటి కప్పుడు అవుతూనే ఉంది.

ఇక సినిమా లో మరో ముఖ్య రోల్ ఉండగా ఆ రోల్ కి చాలా మంది హీరోలను అనుకున్నా రామ్ చరణ్ కే బాగా సూట్ అవుతుందని చిరు కొరటాల శివలు భావించగా ప్రస్తుతం ఆర్ ఆర్ ఆర్ పనుల్లో ఉన్న రామ్ చరణ్ అది ముగిసిన తర్వాత వెంటనే…

ఆచార్య షూటింగ్ లో పాల్గొంటారని సమాచారం. ఎక్స్ టెండెడ్ క్యామియో అయినా కానీ మంచి సీన్స్ ఆ రోల్ కి ఉన్నాయని తెలుస్తుంది, ఇక మరో న్యూస్ ఒకటి లీక్ అయింది, ఆ న్యూస్ ప్రకారం రామ్ చరణ్ పాత్ర కి చిరు పాత్ర కి మధ్య ఒక భారీ ఫైట్ సీన్ కూడా ఉందట.

నువ్వా నేనా అన్నట్లు ఆ ఫైట్ సీన్ ని కొరటాల శివ ఇద్దరికీ సమానమైన ఎలివేషన్స్ తో రాసుకున్నారని అంటున్నారు. అది చిత్రీకరించిన తర్వాత వెండితెరపై చూస్తె ఫ్యాన్స్ కి గూస్ బంప్స్ వచ్చేలా రాసున్నాడని టాక్ ఉంది.. తండ్రీ కొడుకుల మధ్య ఈ భారీ ఫైట్ సీన్ మెగా ఫ్యాన్స్ కి అల్టిమేట్ కిక్ ఇవ్వడం ఖాయమని చెప్పొచ్చు.

ఇక సినిమా త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ తిరిగి మొదలు అవుతుందని, బడ్జెట్ కూడా తగ్గించుకున్న టీం, ఈ ఇయర్ ఎండ్ కల్లా సినిమా షూటింగ్ పూర్తీ చేసి సినిమా ను సంక్రాంతి కానుకగా రిలీజ్ చేయాలనే ఆలోచన లో ఉన్నట్లు తెలుస్తుంది. ఇది అనుకున్నట్లు జరుగుతుందా లేదా అన్నది మాత్రం ప్రస్తుతానికి చెప్పలేం అనే చెప్పాలి….

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here