Home న్యూస్ కస్టడీ ట్రైలర్ 24 గంటల రిపోర్ట్…ఇటు కుమ్మింది…కానీ అటు !!

కస్టడీ ట్రైలర్ 24 గంటల రిపోర్ట్…ఇటు కుమ్మింది…కానీ అటు !!

0

యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య బాక్ టు బాక్ హాట్రిక్ హిట్స్ తర్వాత ఆడియన్స్ ముందుకు 2022 ఇయర్ లో థాంక్ యు మరియు హిందీ మూవీ లాల్ సింగ్ చడ్డా సినిమాలతో వచ్చినా 2 సినిమాలు తీవ్రంగా నిరాశ పరిచే రిజల్ట్ ను ఇచ్చిన తర్వాత సాలిడ్ కంబ్యాక్ కోసం ఎదురు చూస్తూ ఉండగా కోలివుడ్ డైరెక్టర్ వెంకట్ ప్రభు డైరెక్షన్ లో తెలుగు తమిళ్ లో రూపొందుతున్న లేటెస్ట్ బైలింగువల్ మూవీ కస్టడీ…

సినిమాను ఆడియన్స్ ముందుకు మే 12న తీసుకు రావడానికి సిద్ధం అవుతూ ఉండగా సినిమా అఫీషియల్ టీసర్ ను రీసెంట్ గా రిలీజ్ చేయగా టీసర్ కి ఆడియన్స్ నుండి మంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది, నాగ చైతన్య న్యూ లుక్ అరవింద్ స్వామి విలనిజం మరియు వెంకట్ ప్రభు టేకింగ్…

టీసర్ కి హైలెట్స్ గా నిలవగా తమిళ్ లో కూడా పర్వాలేదు అనిపించేలా రెస్పాన్స్ ను సొంతం చేసుకున్న ఈ సినిమా టీసర్ తెలుగు లో వ్యూస్ పరంగా మొదటి 24 గంటల్లో సెన్సేషనల్ రెస్పాన్స్ ను సొంతం చేసుకున్నా లైక్స్ పరంగా మాత్రం అంతగా…

జోరు చూపించలేక పోయింది. మొత్తం మీద 24 గంటల్లో 8.33 మిలియన్స్ దాకా వ్యూస్ ని సొంతం చేసుకుని దుమ్ము దుమారం లేపిన ఈ టీసర్ లైక్స్ పరంగా మాత్రం 117.1K లైక్స్ తోనే సరిపెట్టుకుని యావరేజ్ గా నిలిచింది. కానీ ఓవరాల్ గా రెస్పాన్స్ బాగుండటంతో బాక్స్ ఆఫీస్ దగ్గర జోరు చూపించే అవకాశం ఉండనిపించేలా మెప్పించింది అని చెప్పాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here