Home న్యూస్ 2.0 ఫస్ట్ డే కలెక్షన్స్…ఊహకందని భీభత్సం

2.0 ఫస్ట్ డే కలెక్షన్స్…ఊహకందని భీభత్సం

0

     బాహుబలి 2 తర్వాత అంతటి అంచనాల నడుమ ప్రేక్షకుల ముందుకు వచ్చిన సెన్సేషనల్ రోబో 2 మొదటి రోజు హిస్టారికల్ కలెక్షన్స్ రికార్డులతో దుమ్ము దుమారం చేస్తూ నార్త్ నుండి సౌత్ వరకు ఊహకందని కలెక్షన్స్ రికార్డులను నమోదు చేస్తూ సంచలనం సృష్టించింది. సినిమా అన్ని భాషల లో మొదటి రోజు కలెక్షన్స్ పరంగా దుమ్ము లేపగా డే ఎండ్ లో సినిమా అన్ని చోట్లా ఎలాంటి కలెక్షన్స్ ని సాధించ బోతుందో తెలుసుకుందాం పదండి.

తెలుగు: అన్ని చోట్లా ఓపెనింగ్స్ ఒకెత్తు అయితే తెలుగు రాష్ట్రాలలో సినిమా ఓపెనింగ్స్ మరో ఎత్తు అని చెప్పాలి. పెద్దగా ప్రమోషన్ లేకపోయినా ఈవినింగ్ అండ్ నైట్ షోల బుకింగ్స్ 95% కి టచ్ చేసి తొలిరోజు లెక్క 18 కోట్ల రేంజ్ లో ఉండే చాన్స్ ఉంది.

తమిళ్: తమిళ్ లో సినిమా స్లో గా మొదలైన పాజిటివ్ టాక్ పవర్ తో మ్యాట్నీ షో నుండే పుంజుకున్న ఈ సినిమా మొదటి రోజు టోటల్ గా 85% కి పైగా ఆక్యుపెన్సీ ని సాధించి టోటల్ గా మొదటి రోజు లెక్క సుమారు 30 కోట్ల రేంజ్ లో గ్రాస్ ని అందుకునే అవకాశం ఉంది.

హిందీ: తెలుగు తమిళ్ తో పోల్చుకుంటే స్లో గా మొదలైన ఈ సినిమా టాక్ బాగున్నా ఈవినింగ్ అండ్ నైట్ షోల సమయానికి గ్రోత్ మరీ భీభత్సం కాదు బాగానే గ్రోత్ ని అందుకుని 26 కోట్ల నుండి 28 కోట్ల రేంజ్ లో నెట్ వసూళ్లు సాధించే అవకాశం ఉంది.

ఇక కర్ణాటక కేరళ మిగిలిన చోట్ల కూడా మొదటి రోజు సాలిడ్ కలెక్షన్స్ ని అందుకుంటూ అన్నీ అనుకున్నట్లు జరిగితే 160 కోట్లకు పైగా గ్రాస్ ని మొదటి రోజు అందుకునే అవకాశం పుష్కలంగా ఉంది ఈ సినిమా కి. నైట్ షోల ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ జోరు అందుకుంటే ఈ లెక్క మరింత పెరిగే అవకాశం ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here