Home న్యూస్ చెన్నై లో సర్కార్ ఔట్…సూపర్ స్టార్ దెబ్బ అదుర్స్

చెన్నై లో సర్కార్ ఔట్…సూపర్ స్టార్ దెబ్బ అదుర్స్

0

   సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన లేటెస్ట్ మూవీ రోబో 2.0 బాక్స్ ఆఫీస్ దగ్గర అత్యంత భారీ ఎత్తున రిలీజ్ అవ్వగా మొదటి రోజు సినిమా సాధించే కలెక్షన్స్ రికార్డులు ఎలా ఉంటాయి అనేది ఇప్పుడు అందరి లోను ఆసక్తిని రేపుతుంది. కాగా రోబో 2.0 సినిమా ఏరియా ల వారి గా మొదటి రోజు కలెక్షన్స్ వివరాలు రిలీజ్ అవుతుండగా సినిమా చెన్నై ఏరియా లో మొదటి రోజు కలెక్షన్స్ ని రిలీజ్ చేశారు.

అక్కడ మొదటి రోజు వర్కింగ్ డే అయినా కానీ ఆల్ టైం ఇండస్ట్రీ రికార్డు ను నమోదు చేస్తూ రీసెంట్ గా అక్కడ డే 1 ఇండస్ట్రీ రికార్డ్ కొట్టిన ఇలయ ధలపతి విజయ్ నటించిన సర్కార్ సినిమా మొదటి రోజు గ్రాస్ 2.37 కోట్ల రికార్డ్ ను బ్రేక్ చేసి సంచలనం సృష్టించింది.

మొదటి రోజు 2.0 సినిమా అక్కడ ఏకంగా 2.64 కోట్ల గ్రాస్ మార్క్ ని అందుకుని చెన్నై లో మొదటి రోజు 2.5 కోట్ల గ్రాస్ మార్క్ ని దాటిన ఏకైక సినిమా గా నిలిచి చారిత్రిక రికార్డ్ ను వర్కింగ్ డే లో సాధించింది. అదే హాలిడే అయ్యి ఉంటె లెక్క 3 కోట్లు దాటేదని అంటున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here