Home న్యూస్ దేవదాస్ 2nd డే కలెక్షన్స్….షాకింగ్…ఇది సరిపోదు సామి

దేవదాస్ 2nd డే కలెక్షన్స్….షాకింగ్…ఇది సరిపోదు సామి

0

ప్రేక్షకుల ముందుకు రీసెంట్ గా దేవదాస్ తో వచ్చేశారు కింగ్ నాగార్జున మరియు నాచురల్ స్టార్ నాని లు…ఈ ఇద్దరి పాత సినిమాలు ఫ్లాఫ్ అవ్వడంతో ఇద్దరు కలిసి ఈ సారి దుమ్ము లేపే హిట్ కొట్టాలి అని ఫిక్స్ అయ్యి ఈ సినిమాను భారీ గా రిలీజ్ చేశారు.

తొలి ఆటకే మంచి టాక్ ని సొంతం చేసుకుని మొదటి రోజు టోటల్ గా 7.1 కోట్ల షేర్ ని అందుకున్న ఈ సినిమా రెండో రోజు మాత్రం స్లో డౌన్ అయ్యింది. వర్కింగ్ డే ఎఫెక్ట్ కావచ్చు యునానీమస్ పాజిటివ్ టాక్ లేకపోవడం కావచ్చు కలెక్షన్స్ అనుకున్న రేంజ్ లో అయితే రాలేదు.

రెండో రోజు ఓపెనింగ్స్ 55% వరకు మొదటి రోజు తో పోల్చుకుంటే డ్రాప్ అవ్వగా ఈవినింగ్ షోలకి 5 నుండి 8 శాతం మాత్రమే గ్రోత్ సాధించింది ఈ సినిమా…దాంతో రెండో రోజు సినిమా రెండు రాష్ట్రాలలో 2.5 కోట్ల రేంజ్ లో టోటల్ వరల్డ్ వైడ్ గా 3 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోవచ్చని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ప్రీ రిలీజ్ బిజినెస్ 37.2 కోట్లు అవ్వడంతో ఈ ఓపెనింగ్స్ ఏమాత్రం సరిపోవనే చెప్పాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here