విక్టరీ వెంకటేష్ నటించిన లేటెస్ట్ మూవీ దృశ్యం 2 బాక్స్ ఆఫీస్ దగ్గర రిలీజ్ అవ్వాల్సిన సినిమా, కానీ ఆంధ్రలో పరిస్థితులను అడ్డం చెబుతూ నిర్మాత సురేష్ బాబు ఓపెన్ గా సినిమాను డిజిటల్ లోనే రిలీజ్ చేశామని కుండ బద్దలు కొట్టినట్లు చెప్పేశారు. ఒరిజినల్ వర్షన్ అంటే అప్పటి పరిస్థితుల వలన ఆల్ రెడీ ప్రైమ్ వీడియోతో ఒప్పందం వలన డిజిటల్ లో రిలీజ్ అవ్వాల్సి వచ్చింది, కానీ దృశ్యం 2 తెలుగు రీమేక్…
విషయంలో థియేటర్స్ కి వెళ్ళే ఛాన్స్ ఉన్నప్పటికీ అలా చేయలేదు మేకర్స్… ప్రస్తుత కారణాల వలన సినిమా డిజిటల్ లో రీసెంట్ గా రిలీజ్ అవ్వాల్సి రాగా సినిమా ని చూసిన ఆడియన్స్ నుండి అద్బుతమైన రెస్పాన్స్ వస్తూ ఉండటం విశేషం అని చెప్పాలి. ఇక సినిమా కి…
వస్తున్న వ్యూవర్ షిప్ లెక్కలు అన్నీ కూడా త్వరలో బయటికి రాబోతుండగా దృశ్యం2 ఒరిజినల్ వర్షన్ ని చూడకుండా తెలుగు రీమేక్ ని ఇప్పుడే ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళ అందరిలో ఎక్కువ శాతం మంది థియేటర్స్ లో ఈ సినిమా పడి ఉంటే అదిరి పోయి ఉండేదని చెబుతూ ఉండటం విశేషం అని చెప్పాలి.
సినిమాలో ఉన్న సీన్స్ అన్నీ ఒకెత్తు కానీ క్లైమాక్స్ లో కోర్టు సీన్ లో అప్పటి వరకు ఏమవుతుందో అన్న ఆతృత కి కంప్లీట్ గా యూ టర్న్ తీసుకునేలా జడ్జ్ ఇచ్చే స్టేట్ మెంట్ ఆ తర్వాత కోర్టు మొత్తం హీరో వైపు చూసే సీన్ కి రెస్పాన్స్ అయితే మరో లెవల్ లో ఉంటుందని…..
ఈ సీన్ ని థియేటర్స్ లో ఎక్స్ పీరియన్స్ చేసి ఉంటే రచ్చ రచ్చగా ఉండేదని సోషల్ మీడియాలో అందరూ చెబుతూ ఉండటం విశేషం. ఒరిజినల్ ని చూసే టైం లో కూడా ఈ సీన్ కి థియేటర్స్ లో రెస్పాన్స్ దద్దరిల్లిపోయేదని అందరూ అభిప్రాయపడ్డారు. తెలుగు లో అయినా అది జరుగుతుందేమో అనుకుంటే ఇక్కడ కూడా డిజిటల్ లోనే ఈ సీన్ ని చూడాల్సి రావడం కొంత నిరాశే అని చెప్పాలి.