Home న్యూస్ 24 గంటలు ఓవర్….ఇలాంటి రెస్పాన్స్ ఎక్స్ పెర్ట్ చేయలేదు!

24 గంటలు ఓవర్….ఇలాంటి రెస్పాన్స్ ఎక్స్ పెర్ట్ చేయలేదు!

0

రీసెంట్ టైం లో ఎక్కువగా మల్టీ స్టారర్ మూవీస్ చేసిన విక్టరీ వెంకటేష్ సోలో హీరోగా చేసిన నారప్ప మరియు దృశ్యం 2 సినిమాలు ఆడియన్స్ ముందుకు థియేటర్స్ లో వచ్చి రచ్చ చేస్తాయి అనుకుంటే ముందు నారప్ప సినిమా డిజిటల్ లోనే అనుకోని కారణాల వలన రిలీజ్ అవ్వగా ఇప్పుడు దృశ్యం 2 అయినా థియేటర్స్ లో వస్తుంది అను కుంటే ఈ సినిమా కూడా ఇప్పుడు డిజిటల్ లోనే రిలీజ్ కాబోతుంది.

ఈ సినిమా ఈ నెల 25న ఆడియన్స్ ముందుకు అమెజాన్ ప్రైమ్ లో ఆడియన్స్ ముందుకు రావడానికి సిద్ధం అవుతూ ఉండగా సినిమా అఫీషియల్ టీసర్ ను కానీ ట్రైలర్ కానీ ఎలాంటి హడావుడి లేకుండా చాలా సైలెంట్ గా రిలీజ్ చేశారు… ఒక చిన్న ఈవెంట్ పెట్టి…

రీసెంట్ గా సినిమా ట్రైలర్ ను రిలీజ్ చేయగా అంతకుముందు జస్ట్ అనౌన్స్ మెంట్ తోనే డైరెక్ట్ గా టీసర్ ను కూడా రిలీజ్ చేశారు. దాంతో మినిమమ్ బజ్ కూడా క్రియేట్ అవ్వకుండా వచ్చిన టీసర్ కి అంతంత మాత్రమే రెస్పాన్స్ రాగా ఇప్పుడు ట్రైలర్ కి కూడా వ్యూస్ అండ్ లైక్స్ పరంగా…

జస్ట్ ఒకే అనిపించే రెస్పాన్స్ ఆడియన్స్ నుండి సొంతం అయ్యింది. వ్యూస్ పరంగా ట్రైలర్ కి 4.25 మిలియన్ వ్యూస్ దక్కగా ఓవరాల్ గా ఇది పర్వాలేదు అనిపించినా లైక్స్ మాత్రం కేవలం 54K లైక్స్ ని మాత్రమే సొంతం చేసుకుని తీవ్రంగా నిరాశ పరిచింది ఈ ట్రైలర్. ఇది వరకు వచ్చిన వెంకీ నారప్ప ట్రైలర్ 24 గంటల్లో 6.3 మిలియన్ వ్యూస్ ని…

164K దాకా లైక్స్ ని సొంతం చేసుకుని దుమ్ము లేపింది, ఆ రెస్పాన్స్ తో పోల్చితే ఇప్పుడు దృశ్యం 2 కి ఇంకా బెటర్ రెస్పాన్స్ అంచనా వేసినా జస్ట్ యావరేజ్ అనిపించే రెస్పాన్స్ తోనే సరిపెట్టుకుంది. ఇక సినిమా ఈ నెల 25 న డిజిటల్ రిలీజ్ కాబోతుంది కాబట్టి ఆడియన్స్ నుండి ఎలాంటి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంటుంది అన్నది ఆసక్తిగా మారింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here