Home న్యూస్ దృశ్యం2 ట్రైలర్ రివ్యూ…రీసెంట్ టైం లో ఇలా జరగడం ఇదే ఫస్ట్ టైం!

దృశ్యం2 ట్రైలర్ రివ్యూ…రీసెంట్ టైం లో ఇలా జరగడం ఇదే ఫస్ట్ టైం!

0

విక్టరీ వెంకటేష్ నటించిన లేటెస్ట్ మూవీ దృశ్యం2 పై ఆడియన్స్ లో మంచి అంచనాలు ఉన్నాయి, ఈ మధ్య వరుసగా మల్టీ స్టారర్ లు చేస్తున్న వెంకీ సోలోగా చేసిన సినిమాలు నారప్ప మరియు దృశ్యం2 లు, అందులో నారప్ప అనుకోని కారణాల వలన డైరెక్ట్ గా డిజిటల్ లో రిలీజ్ అవ్వాల్సి రాగా ఇప్పుడు దృశ్యం2 అయినా థియేటర్స్ లో వస్తుంది అనుకుంటే ఈ సినిమా కూడా డిజిటల్ లోనే రిలీజ్ కానుంది.

రీసెంట్ గా ఎలాంటి హడావుడి లేకుండా సినిమా థియేట్రికల్ ట్రైలర్ ను రిలీజ్ చేశారు. అసలు మినిమమ్ పబ్లిసిటీ కూడా చడీ చప్పుడు కూడా లేకుండా ఒక ఈవెంట్ పెట్టేసి ఆ ఈవెంట్ లో ట్రైలర్ లాంచ్ చేసేశారు, మొన్న అనౌన్స్ మెంట్ అప్పుడు కూడా ఎలాంటి అప్ డేట్స్ లేకుండా…

సినిమా గురించి అప్ డేట్ అని చెప్పి రిలీజ్ డేట్ ను టీసర్ ను రిలీజ్ చేశారు. ఇక ఇప్పుడు ట్రైలర్ ని కూడా అలానే చేయగా ట్రైలర్ చూసిన తర్వాత ఈ థ్రిల్లర్ థియేటర్స్ లో చూడాల్సిన సినిమా అని ఎవ్వరికైనా అనిపించడం ఖాయం. దృశ్యం తెలుగు లో కూడా…

సూపర్ హిట్ గా నిలిచిన సినిమా, అలాంటి సినిమాకి సీక్వెల్ గా వస్తున్న దృశ్యం2 పై మంచి అంచనాలే ఉన్నాయి, ట్రైలర్ లో రాంబాబు కేసు నుండి తన కుటుంబం తప్పించుకున్న తర్వాత కొంతకాలానికి మళ్ళీ ఆ కేసులో కొన్ని క్లూలు దొరకడంతో కేసుని రీ ఓపెన్ చేయడంతో ఎలాంటి ఇబ్బందులలో పడ్డాడు, తిరిగి తన ఫ్యామిలీని కాపాడుకున్నాడా లేదా అన్న కథతో…

ఈ సీక్వెల్ తెరకెక్కింది, సినిమా క్లైమాక్స్ ఊహకందని ట్విస్ట్ ఇచ్చి సర్ప్రైజ్ చేస్తుంది… మలయాళ దృశ్యం2 కి తెలుగులో కొన్ని చిన్న చిన్న మార్పులు చేశారు అని అంటున్నారు. మరి ఆ మార్పులు ఎంతవరకు ఆకట్టుకుని ఒరిజినల్ రేంజ్ లో మెప్పిస్తాయో లేదో చూడాలి. ఇక ట్రైలర్ కి 24 గంటల్లో ఎలాంటి వ్యూస్ అండ్ లైక్స్ దక్కుతాయో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here