Home న్యూస్ ఈనగరానికి ఏమైంది రీ రిలీజ్…ఇవేం బుకింగ్స్ రా బాబు!!

ఈనగరానికి ఏమైంది రీ రిలీజ్…ఇవేం బుకింగ్స్ రా బాబు!!

0

కొన్ని కొన్ని సార్లు రిలీజ్ అయినప్పుడు కన్నా టెలివిజన్ లోనో లేక డిజిటల్ లోనో కొన్ని సినిమాలు మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంటాయి. 5 ఏళ్ల క్రితం ఓ చిన్న సినిమా విషయంలో కూడా ఇదే జరిగింది. థియేటర్స్ లో రిలీజ్ అయినప్పుడు ఆ సినిమాను పెద్దగా…

ఎవరూ పట్టించుకోలేదు. దాంతో అనుకున్న రేంజ్ లో ఆడియన్స్ ను రీచ్ అవ్వలేక పోయిన ఈ సినిమా తర్వాత డిజిటల్ లో, టీవీలలో అన్నింటికీ మించి మీమ్స్ ద్వారా సోషల్ మీడియాలో తిరుగులేని క్రేజ్ ను సొంతం చేసుకుని కల్ట్ మూవీ అనిపించుకునే లెవల్ కి ఎదిగింది.

ఆ సినిమానే పెళ్లి చూపులు ఫేం తరుణ్ భాస్కర్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈనగరానికి ఏమైంది మూవీ(Ee Nagaranik iEmaindi) 5 ఏళ్ల క్రితం రిలీజ్ అయినప్పుడు అంచనాలను అందుకోక పోయినా తర్వాత ఈ సినిమా పాపులారిటీ ఓ రేంజ్ లో పెరిగి పోగా ఇప్పుడు సినిమా రిలీజ్ అయిన…

5 ఏళ్ల తర్వాత ఇప్పుడు థియేటర్స్ లో ఈ సినిమాను రీ రిలీజ్ చేయాలని డిసైడ్ అవ్వగా రీసెంట్ టైంలో వచ్చిన రీ రిలీజ్ మూవీస్ లో ఎలాంటి బజ్ లేకుండా రిలీజ్ అవుతున్న ఈ సినిమా 29న ఆడియన్స్ ముందుకు సెలెక్టివ్ థియేటర్స్ లో రిలీజ్ కానుండగా హైదరాబాదులో..

గుంటూరులో, వైజాగ్ లో ఇలా చాలా సెంటర్స్ లో బుకింగ్స్ కి టెర్రిఫిక్ రెస్పాన్స్ సొంతం అయ్యింది, హైదరాబాదులో అయితే బుకింగ్స్ నెక్స్ట్ లెవల్ లో ఉండగా కొత్త సినిమాలు ఆ రోజు రిలీజ్ ఉన్నప్పటికీ ఈ సినిమా బుకింగ్స్ జోరుగా సాగుతూ ఉండటం ఇప్పుడు ట్రేడ్ ని కూడా ఆశ్యర్యానికి గురి చేస్తుంది. ఇక సినిమా రీ రిలీజ్ లో వసూళ్లు ఎలా ఉంటాయో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here