Home న్యూస్ ఈనగరానికి ఏమైంది రీ రిలీజ్ కలెక్షన్స్…ఎవ్వరి ఊహలకు అందని ఊచకోత ఇది!!

ఈనగరానికి ఏమైంది రీ రిలీజ్ కలెక్షన్స్…ఎవ్వరి ఊహలకు అందని ఊచకోత ఇది!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర రీ రిలీజ్ ట్రెండ్ రీసెంట్ గా పీక్స్ కి వెళ్ళిపోయింది. స్టార్స్ నటించిన సినిమాల రీ రిలీజ్ లు భారీగా రిలీజ్ అవుతూ ఉండగా అసలు ఎవ్వరూ ఊహించని ఓ సినిమా రీ రిలీజ్ లో ఊహకందని రెస్పాన్స్ ను ఆడియన్స్ నుండి సొంతం చేసుకుంది…

ఆ సినిమానే ఈనగరానికి ఏమైంది(Ee Nagaraniki Emaindi), 2018 టైంలో రిలీజ్ అయినప్పుడు అనుకున్న రేంజ్ లో సక్సెస్ అవ్వలేక పోయిన ఈ సినిమా తర్వాత డిజిటల్ లో సూపర్ సక్సెస్ గా నిలవగా మీమ్స్ ద్వారా మరింత ఫేమస్ అయ్యి ఓ క్లాసిక్ స్టేచర్ ని దక్కించుకుంది.

అలాంటి స్టేచర్ ను దక్కించుకున్న ఈ సినిమా రిలీజ్ అయ్యి 5 ఏళ్ళు పూర్తీ అయిన సందర్బంగా రీసెంట్ గా రీ రిలీజ్ చేయగా సినిమా ఊహకందని రెస్పాన్స్ ను ఆడియన్స్ నుండి సొంతం చేసుకుని కలెక్షన్స్ పరంగా దుమ్ము దుమారం లేపిందని చెప్పాలి…

మొదటి రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర రీ రిలీజ్ లో ఈ సినిమా నైజాంలో 81 లక్షల రేంజ్ లో గ్రాస్ ను సొంతం చేసుకుని ఊచకోత కోయగా సినిమా టోటల్ గా ఆంధ్ర సీడెడ్ లో 88 లక్షల దాకా గ్రాస్ ను అందుకుంది. సినిమా మొదటి రోజు తెలుగు రాష్ట్రాల్లో టోటల్ గా ఇప్పుడు….

1.69 కోట్ల రేంజ్ లో గ్రాస్ ఓపెనింగ్స్ తో ఊహకందని ఊచకోత కోసింది ఇప్పుడు. ఇక సినిమా టోటల్ గా మొదటి రోజు వరల్డ్ వైడ్ గా 1.78 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను సొంతం చేసుకుంది. ఈ రేంజ్ లో ఓ చిన్న సినిమా రీ రిలీజ్ లో ఈ రేంజ్ లో వసూళ్ళని అందుకోవడం మామూలు విషయం కాదు….

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here