బాక్స్ ఆఫీస్ దగ్గర గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Ram Charan) శంకర్(Shankar) ల కాంబోలో భారీ బడ్జెట్ తో భారీ అంచనాల నడుమ రూపొందిన గేమ్ చేంజర్(Game Changer)మూవీ సంక్రాంతికి భారీ ఎత్తున రిలీజ్ అవ్వగా మొదటి ఆటకే నెగటివ్ టాక్ ను సొంతం చేసుకున్న సినిమా ఓపెనింగ్స్ రోజు నుండే ఏమాత్రం అంచనాలను అందుకోలేక పోయింది…
తెలుగు రాష్ట్రాలతో పాటు అన్ని చోట్లా కూడా సినిమా ఏమాత్రం ఇంపాక్ట్ ను అయితే చూపించ లేక పోయింది. సినిమా డైరెక్టర్ శంకర్ కి తమిళ్ లో ఉన్న క్రేజ్ చూసి అక్కడ కచ్చితంగా జోరు చూపిస్తుంది అనుకున్నా కూడా ఏమాత్రం ఇంపాక్ట్ ను చూపించ లేక పోయిన సినిమా….
అక్కడ ఓపెనింగ్స్ నుండి లాంగ్ రన్ వరకు ఏమాత్రం ఇంపాక్ట్ ని చూపించ లేక పోయింది… ఓవరాల్ గా 15 కోట్ల రేంజ్ లో వాల్యూ బిజినెస్ ను తమిళనాడులో సొంతం చేసుకున్న సినిమా మంచి కలెక్షన్స్ ని సొంతం చేసుకుంటుంది అనుకున్నా కూడా…
ఓపెనింగ్స్ అండ్ లాంగ్ రన్ తీవ్రంగా నిరాశ పరిచిన సినిమా టోటల్ రన్ లో అక్కడ 9.70 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను మాత్రమే సొంతం చేసుకున్న సినిమా ఫైనల్ రన్ లో 4.32 కోట్ల రేంజ్ లో షేర్ ని మాత్రమే అందుకుని పరుగును పూర్తి చేసుకుంది…. ఓవరాల్ గా 15 కోట్ల బిజినెస్ కి గాను సినిమా…
4.32 కోట్లు రికవరీ చేసిన సినిమా 10.6 కోట్లకు పైగా లాస్ ను అక్కడ సొంతం చేసుకుని డబుల్ డిసాస్టర్ గా నిలిచింది సినిమా…శంకర్ బ్రాండ్ వాల్యూ కూడా సినిమాకి అక్కడ ఏమాత్రం హెల్ప్ అవ్వకపోవడం విచారకరం అని చెప్పాలి. ఇక ఈ సినిమా తర్వాత శంకర్ రామ్ చరణ్ లు ఎలాంటి కంబ్యాక్ ను సొంతం చేసుకుంటారో చూడాలి ఇక…