Home న్యూస్ 12 కోట్లకి నో అన్నారు…’గుడ్ లక్ సఖి’ బిజినెస్-థియేటర్స్….బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఇదే!!

12 కోట్లకి నో అన్నారు…’గుడ్ లక్ సఖి’ బిజినెస్-థియేటర్స్….బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఇదే!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర ఎప్పుడో రిలీజ్ అవ్వాల్సిన సినిమాలలో కీర్తి సురేష్ మెయిన్ లీడ్ లో నటించిన గుడ్ లఖ్ సఖి సినిమా కూడా ఒకటి… ఎప్పుడో రెండున్నర ఏళ్ల క్రితమే ఆడియన్స్ ముందుకు రావాల్సిన ఈ సినిమా రిలీజ్ ఎప్పటి కప్పుడు ఏవో కారణాల వలన పోస్ట్ పోన్ అవుతూ రాగా సినిమా 2020 సెకెండ్ ఆఫ్ టైం లో డిజిటల్ లో రిలీజ్ కి మంచి మంచి ఆఫర్స్ వచ్చాయి….

ఆల్ మోస్ట్ 10 నుండి 12 కోట్ల రేంజ్ డైరెక్ట్ రిలీజ్ ఆఫర్స్ ను సొంతం చేసుకున్న ఈ సినిమా థియేటర్స్ లోనే రిలీజ్ అవ్వాలని ఫిక్స్ అయ్యి లాస్ట్ ఇయర్ రిలీజ్ కి చాలా డేట్స్ ని అనౌన్స్ చేసినా ఏ డేట్ కి కూడా రిలీజ్ అవ్వని సినిమా ఎట్టకేలకు ఇప్పుడు 28న…

రిలీజ్ అవ్వబోతుండగా సినిమా కి ఇప్పుడు తెలుగు రాష్ట్రాలలో నైజాంలో 100, సీడెడ్ లో 40 మరియు ఆంధ్రలో 160 థియేటర్స్ సొంతం అవ్వగా 300 వరకు థియేటర్స్ లో ఇక్కడ రిలీజ్ కాబోతున్న ఈ సినిమా టోటల్ వరల్డ్ వైడ్ గా సుమారు 540 కి పైగా థియేటర్స్ లో రిలీజ్ కాబోతుంది….

చిన్న సినిమానే అయినా పర్వాలేదు అనిపించేలా రిలీజ్ కానున్న ఈ సినిమా ఓవరాల్ బిజినెస్ లెక్కలు ఏవి క్లియర్ గా రివీల్ చేయలేదు కానీ ట్రేడ్ లెక్కల్లో రెండు తెలుగు రాష్ట్రాలలో సినిమా బిజినెస్ వాల్యూ 2.2 కోట్ల రేంజ్ లో ఉంటుందని వరల్డ్ వైడ్ గా 2.6 కోట్ల రేంజ్ లో ఉంటుందని అంచనా వేస్తున్నారు…. ఈ లెక్కన సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర హిట్ అవ్వాలి అంటే…

3 కోట్ల రేంజ్ లో కలెక్షన్స్ ని వరల్డ్ వైడ్ గా అందుకోవాల్సి ఉంటుంది, 12 కోట్ల డైరెక్ట్ రిలీజ్ ఆఫర్ ను నో చెప్పినా బాక్స్ ఆఫీస్ దగ్గర టాక్ బాగుంటే కలెక్షన్స్ ఎంతో కొంత వచ్చే ఛాన్స్ ఉండగా తర్వాత డిజిటల్ అండ్ శాటిలైట్ రైట్స్ తో సినిమాకి ఓవరాల్ గా మంచి రేటు సొంతం అయ్యే అవకాశం ఎంతైనా ఉంటుందని చెప్పాలి. ఇక సినిమా ఎలా పెర్ఫార్మ్ చేస్తుందో చూడాలి….

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here