బాక్స్ ఆఫీస్ దగ్గర కొత్త సినిమాలు రిలీజ్ అయితే ఆ సినిమాల ప్రమోషన్స్ తో స్టార్స్ అందరూ తెగ బిజీగా ఉంటారు, కానీ తమిళ్ ఇండస్ట్రీ టాప్ స్టార్స్ అయిన దళపతి విజయ్(Thalapathy Vijay) కానీ తల అజిత్ కుమార్(Ajith Kumar) కానీ ఆ సినిమాల ప్రమోషన్స్ లాంటివి అస్సలు చేయకున్నా కూడా ఆ సినిమాల క్రేజ్ మరో లెవల్ లో ఉంటుంది…
లేటెస్ట్ గా అజిత్ కుమార్ నటించిన కొత్త సినిమా గుడ్ బ్యాడ్ అగ్లీ(Good Bad Ugly Movie) మూవీ ఆడియన్స్ ముందుకు ఈ వీకెండ్ లో రిలీజ్ కి సిద్ధం అవుతూ ఉండగా సినిమా టీసర్ ట్రైలర్ లు తమిళ్ లో మంచి బజ్ నే క్రియేట్ చేయగా భారీ లెవల్ లో సినిమాను.
రిలీజ్ కి సిద్ధం చేస్తూ ఉండగా మరోసారి ఎలాంటి ప్రమోషన్స్ లాంటివి లేకుండానే రిలీజ్ కాబోతున్న ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ రీసెంట్ గా ఓపెన్ చేయగా అన్ని చోట్లా సెన్సేషనల్ బుకింగ్స్ తో మాస్ రచ్చ చేస్తూ దూసుకు పోతున్న ఈ సినిమా తమిళనాడులో…
మొదటి రోజుకి గాను ఇప్పటి వరకు చేసిన బుకింగ్స్ తో 12 కోట్ల రేంజ్ లో గ్రాస్ బుకింగ్స్ మార్క్ ని అందుకోగా రెస్ట్ ఆఫ్ ఇండియా మొత్తం మీద మరో కోటికి పైగా గ్రాస్ బుకింగ్స్ ను సొంతం చేసుకుంది. ఇక ఓవర్సీస్ లో కూడా మంచి జోరుని చూపెడుతూ దూసుకు పోతున్న ఈ సినిమా…
అక్కడ కూడా ఆల్ మోస్ట్ 1 మిలియన్ మార్క్ ని అందుకోబోతూ ఉండగా ఓవరాల్ గా మొదటి రోజుకి గాను అడ్వాన్స్ బుకింగ్స్ తో 21 కోట్ల మార్క్ ని దాటేసి మాస్ రచ్చ చేయగా అన్నీ అనుకున్నట్లు జరిగితే అజిత్ కుమార్ కెరీర్ బెస్ట్ ఓపెనింగ్స్ ను నమోదు చేసే అవకాశం…
ఎంతైనా ఉందని పించే రేంజ్ లో బుకింగ్స్ లో జోరు చూపిస్తూ ఉందని చెప్పాలి. ఇక సినిమా కి ఏమాత్రం టాక్ బాగున్నా కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర ఎక్స్ లెంట్ గా జోరు చూపించి రిమార్కబుల్ ఓపెనింగ్స్ ను సొంతం చేసుకునే అవకాశం సినిమాకి ఎంతైనా ఉందని చెప్పాలి ఇప్పుడు.