బాక్స్ ఆఫీస్ దగ్గర లాస్ట్ ఇయర్ సంక్రాంతికి రిలీజ్ అయినప్పుడు ఓపెనింగ్స్ కుమ్మేసినా పోటి వలన అండర్ పెర్ఫార్మ్ చేసిన సూపర్ స్టార్ మహేష్ బాబు(Mahesh Babu) త్రివిక్రమ్ ల…కాంబోలో ఆడియన్స్ ముందుకు వచ్చిన గుంటూరు కారం(Guntur Kaaram Movie) అంచనాలను పూర్తిగా అందుకోలేక పోయింది కానీ ఇదే సినిమా..
బాక్స్ ఆఫీస్ రన్ ను కంప్లీట్ చేసుకున్న తర్వాత డిజిటల్ లో సూపర్ డూపర్ హిట్ గా నిలిచింది…సోషల్ మీడియా లో తర్వాత ఓ రేంజ్ లో సినిమా సీన్స్ మహేష్ మ్యానరిజమ్స్ లాంటివి పాపులర్ కాగా ఇప్పటికీ కూడా సినిమా సాంగ్స్ అండ్ సీన్స్ ట్రెండ్ అవుతూనే ఉండగా…
టెలివిజన్ లో కూడా కుమ్మేయడం మొదలు పెట్టిన సినిమా, ఆశ్యర్యంగా తెలుగు తో పాటు తమిళ్ లో కూడా సాలిడ్ రీచ్ ను సొంతం చేసుకుంటూ ఉండగా అక్కడ టెలివిజన్ లో టెలికాస్ట్ అయ్యి మంచి రేటింగ్ తో కుమ్మేసింది. ఇక్కడ కొత్త సినిమాలకు కూడా ఇప్పుడు…
అనుకున్న రేంజ్ లో రేటింగ్ లు సొంతం అవ్వడం లేదు..అలాంటిది గుంటూరు కారం సినిమా కి తమిళ్ లో ఫస్ట్ టైం కన్నా కూడా సెకెండ్ టైం రేటింగ్ ఇంకా ఎక్కువ రావడం విశేషం అని చెప్పాలి. ఫస్ట్ టైం అక్కడ సినిమా కి 4.5 టి.ఆర్.పి రేటింగ్ ను సొంతం చేసుకున్న సినిమాకి…
సెకెండ్ టైం మాములుగా అయితే రేటింగ్ తగ్గుతుంది కానీ ఆశ్యర్యంగా 4.73 టి.ఆర్.పి రేటింగ్ సొంతం అయ్యి ఫస్ట్ టైం కన్నా కూడా సెకెండ్ టైం మంచి జోరుని చూపించి ఎక్కువ రేటింగ్ ను అందుకోగా అక్కడ సినిమాకి ఎలాంటి రీచ్ సొంతం అయ్యింది అన్నది ఇది చూస్తె అర్ధం అవుతుంది..
ఓవరాల్ గా గుంటూరు కారం మూవీ రిలీజ్ టైంలో సొంతం చేసుకోవాల్సిన క్రేజ్ అండ్ బజ్ రిలీజ్ అయిపోయిన తర్వాత డిజిటల్ లో, సోషల్ మీడియాలో అలాగే టెలివిజన్ లో మాస్ రచ్చ చేస్తూ దూసుకు పోతూ ఉండటం విశేషం అని చెప్పాలి.