బాక్స్ ఆఫీస్ దగ్గర సరైన హిట్ లేక పోయినా కానీ యంగ్ హీరోల్లో బెల్లంకొండ శ్రీనివాస్ మూవీస్ కి మంచి బజ్ ప్రతీ సినిమాకి సొంతం అవుతూ ఉంటుంది, బెల్లంకొండ శ్రీనివాస్ నటించిన లాస్ట్ మూవీ అల్లుడు అదుర్స్ అంచనాలను అందుకోలేదు. ఆ తర్వాత బెల్లంకొండ నుండి కొత్త సినిమా ఏమి రాలేదు కానీ హిందీలో వివి వినాయక్ డైరెక్షన్ లో చేస్తున్న తెలుగు ఛత్రపతి సినిమా హిందీ రీమేక్ షూటింగ్ మొత్తం అయిపోగా…
ఆడియన్స్ ముందుకు మే నెలలో గ్రాండ్ రిలీజ్ కి సిద్ధం అవుతుంది. కాగా ఈ సినిమా సౌత్ భాషల్లో కూడా డబ్ చేసి రిలీజ్ చేయబోతున్నారు. ఇక సినిమా టీసర్ రిలీజ్ అయ్యే వరకు కూడా అసలు ఈ సినిమా ఉంటుందా లేదా అన్న అనుమానాలు అలాగే…
సినిమా థియేటర్స్ లో రిలీజ్ అవుతుందా లేక డిజిటల్ లో డైరెక్ట్ గా రిలీజ్ అవుతుందా లాంటి అనేక అనుమానాలు ఉన్న నేపధ్యంలో టీసర్ రిలీజ్ తర్వాత లెక్కలన్నీ మారిపోయి సినిమా మీద మంచి బజ్ ఏర్పడింది. ముఖ్యంగా హిందీ లో సినిమా పై బజ్ పెరుగుతుందని సమాచారం.
హిందీలోనే మేజర్ గా తెరకెక్కిన ఈ సినిమాను వచ్చే నెలలో గ్రాండ్ గా రిలీజ్ చేయబోతున్నారు. టీసర్ లో బెల్లంకొండ యాక్షన్ సీన్స్ కి బాలీవుడ్ ఆడియన్స్ ఆసక్తిని పెంచుకున్నారు. ఇక ఎమోషనల్ పార్ట్ కరెక్ట్ గా నటించి ఒరిజినల్ లో సెకెండ్ ఆఫ్ స్లో అయినట్లు కాకుండా కొంచం రేసీగా ఇక్కడ ట్రీట్ మెంట్ ఉంటే ఈ సినిమా తో బెల్లంకొండ హిందీలో మంచి విజయాన్ని అందుకునే అవకాశం ఉంటుంది.