డిఫెరెంట్ జానర్ మూవీస్ తో ప్రయోగాలు చేస్తూ కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర సక్సెస్ లను సొంతం చేసుకుంటున్న అడివి శేష్ నటించిన లేటెస్ట్ మూవీ హిట్2. హిట్ ఫ్రాంచేజ్ లో వచ్చిన ఈ రెండో పార్ట్ టీసర్, ట్రైలర్ రిలీజ్ తర్వాత ఆడియన్స్ లో మంచి క్యూరియాసిటీని క్రియేట్ చేయగా టీం సినిమాను బాగా ప్రమోట్ చేయడంతో జనాలలో ఎక్కువగానే రీచ్ ను సొంతం చేసుకుంది. ఇక వరల్డ్ వైడ్ గా ఆల్ మోస్ట్ 950 కి పైగా థియేటర్స్ లో రిలీజ్ అయిన ఈ సినిమా ఎలా ఉంది ఎంతవరకు ఆకట్టుకుంది లాంటి విశేషాలను తెలుసుకుందాం పదండీ…
ముందుగా స్టొరీ పాయింట్ విషయానికి వస్తే…. ఒక అమ్మాయి మర్డర్ కేసుతో సినిమా ఓపెన్ అవ్వగా ఆ మర్డర్ కేసుని సాల్వ్ చేసే క్రమంలో మర్డర్ అయింది ఒకరు కాదని ఓ సీరియల్ కిల్లర్ అమ్మాయిలను ముక్కలుగా చంపాడని తెలుస్తుంది. ముందు క్రిమినల్ ని తక్కువ అంచనా వేసిన హీరోని క్రిమినల్ ఎలా ఇబ్బంది పెట్టాడు, హీరో ఈ విలన్ ని ఎలా పట్టుకున్నాడు అన్నది మొత్తం మీద సినిమా కథ…
పెర్ఫార్మెన్స్ పరంగా అడివి శేష్ మరోసారి ఆకట్టుకోగా క్లైమాక్స్ లో తన పెర్ఫార్మెన్స్ బాగా మెప్పిస్తుంది, ఇక హీరోయిన్ మీనాక్షి కూడా మెప్పించగా మిగిలిన యాక్టర్స్ అందరూ బాగా చేశారు, విలన్ గురించి మీరు సినిమా చూసి తెలుసుకోవాల్సిందే… సంగీతం పర్వాలేదు అనిపించగా బ్యాగ్రౌండ్ స్కోర్ ఇంకా ఎఫెక్టివ్ గా ఉండి ఉంటే సినిమా ఇంకా బాగుండేది…
కథ ఓవరాల్ గా రీసెంట్ టైం లో వచ్చిన కొన్ని సైకో థ్రిల్లర్ మూవీస్ ని పోలినట్లే ఉన్నా ఇక్కడ రన్ టైం తక్కువ ఉండటం, విలన్ గురించిన ఆసక్తిని అలానే మెయిన్ టైన్ చేయడంతో చాలా వరకు కథ ఎంగేజింగ్ గా సాగుతుంది, కానీ కథ వెంటనే స్టార్ట్ అయినా క్రిస్ప్ గా మారడానికి కొంచం టైం పట్టగా ఇంటర్వెల్ పాయింట్ కి ఆసక్తి భారీగా పెరిగిపోతుంది, సెకెండ్ ఆఫ్ బాగా మెప్పించినా విలన్ ఎందుకో సెట్ అవ్వలేదు అనిపించినా పర్వాలేదు అనిపించాడు, తన ఫ్లాష్ బ్యాక్ ఎందుకో కొంచం వీక్ గా అనిపించింది. అయినా కానీ ఎంగేజింగ్ గా సాగడంతో పర్వాలేదు అనిపిస్తుంది.
ఇక క్లైమాక్స్ లో హిట్ యూనివర్స్ ని మిక్స్ చేయడం పార్ట్ 3 గురించి చెప్పి హైప్ పెంచడం అవన్నీ సినిమాను ఈజీగా ఒకసారి చూడొచ్చు అనిపించేలా చేశాయి. విలన్ ఫ్లాష్ బ్యాక్ ని మరింత స్ట్రాంగ్ గా చూపించి బ్యాగ్రౌండ్ స్కోర్ మరింత బాగుండేలా చూసుకుని ఉంటే ఇంకా బాగుండేది. అయినా కానీ అంచనాలతో వెళ్ళిన ఆడియన్స్ ను కానీ అంచనాలు లేకుండా వెళ్ళిన ఆడియన్స్ ను కానీ సినిమా సాటిస్ ఫై చేయడం ఖాయమని చెప్పాలి. కొన్ని ఫ్లాస్ ఉన్నా హిట్2 కచ్చితంగా మెప్పిస్తుంది… మొత్తం మీద సినిమాకి మా రేటింగ్ 3 స్టార్స్…