Home టోటల్ కలెక్షన్స్ బడ్జెట్ 3 కోట్లు…బిజినెస్ 1.5 కోట్లు…ఓటర్ టోటల్ కలెక్షన్స్ ఇవి!!

బడ్జెట్ 3 కోట్లు…బిజినెస్ 1.5 కోట్లు…ఓటర్ టోటల్ కలెక్షన్స్ ఇవి!!

1321
0

 

కెరీర్ లో ఒక హిట్ ఒక ఫ్లాఫ్ గా చాలా కాలం కెరీర్ ని కొనసాగించిన హీరో మంచు విష్ణు, ఢీ, దేనికైనా రెడీ మరియు దూసుకెల్తా లాంటి హిట్స్ తో మరిన్ని అవకాశాలను అయితే సొంతం చేసుకున్నాడు కానీ చాలా కాలం నుండి టాలీవుడ్ లో నికార్సయిన హిట్ ని అయితే సొంతం చేసుకోలేక పోయాడు. ఈ క్రమం లో మంచు విష్ణు మూవీస్ ని కూడా పట్టించుకున్న వాళ్ళు తక్కువే అయ్యారు.

రీసెంట్ గా మంచు విష్ణు హీరోగా చేసిన “ఓటర్” సినిమా ఎప్పుడు వచ్చిందో ఎప్పుడు వెళ్లిందో కూడా చాలా తక్కువ మందికే తెలుసు. ఇక సినిమా టోటల్ కలెక్షన్స్ విషయానికి వస్తే ముందుగా సినిమా ను 3 కోట్ల రేంజ్ బడ్జెట్ తో రూపొందించారని సమాచారం. కాగా కొన్ని ఏరియాల్లో ఓన్ రిలీజ్ కొన్ని ఏరియాల్లో అమ్మగా ఓవరాల్ గా బిజినెస్ 1.5 కోట్ల రేంజ్ లో ఉందట.

కాగా ఫైనల్ రన్ లో ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర కేవలం 84 లక్షల షేర్ ని మాత్రమె సాధించి బిజినెస్ లో సగం మాత్రమె వెనక్కి తే గలిగింది. దాంతో మొత్తం మీద ఈ సినిమా తో అయినా కంబ్యాక్ ఇద్దామని చూసిన మంచు విష్ణు కి ఎదురుదెబ్బే తగిలింది అని చెప్పొచ్చు. న్యూస్ అప్ డేట్స్ కోసం బెల్ ఐకాన్ ని ప్రెస్ చేసి సబ్ స్బైబ్ చేసుకోండి.. అప్ డేట్ రాగానే నోటిఫికేషన్ మీకు అందుతుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here