Home న్యూస్ 60 అనుకుంటే…అంతకుమించి….నాగ చైతన్య కెరీర్ లో రికార్డ్!

60 అనుకుంటే…అంతకుమించి….నాగ చైతన్య కెరీర్ లో రికార్డ్!

0
Naga Chaitanya Thandel Movie Budget Information
Naga Chaitanya Thandel Movie Budget Information

మజిలీ, లవ్ స్టోరీ లాంటి బాక్ టు బాక్ సోలో బ్లాక్ బస్టర్స్ కొట్టిన యువ సామ్రాట్ నాగ చైతన్య(Naga Chaitanya) తర్వాత చేసిన సోలో మూవీస్ థాంక్ యు మరియు కస్టడీ లాంటి సినిమాలు వరుస ఫ్లాఫ్స్ సాలిడ్ గా ఇంపాక్ట్ చూపించాయి. దాంతో కొంత గ్యాప్ తీసుకుని నాగ చైతన్య ఇప్పుడు కార్తికేయ2(Karthikeya2 Movie) బ్లాక్ బస్టర్ కొట్టిన…

చందు మొండేది డైరెక్షన్ లో చేస్తున్న లేటెస్ట్ మూవీ తండేల్(Thandel Movie) తో దుమ్ము లేపడానికి సిద్ధం అవుతూ ఉండగా ఈ సినిమాలో నాగ చైతన్యకి జోడిగా సాయి పల్లవి(Sai Pallavi) నటిస్తూ ఉండగా సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతూ ఉండగా….ఈ సినిమా బడ్జెట్ ఓవరాల్ గా…

ఇప్పుడు నాగ చైతన్య కెరీర్ లోనే ఆల్ టైం హైయెస్ట్ బడ్జెట్ తో రూపొందుతున్న సినిమా అని వార్తలు వచ్చాయి… ఆల్ మోస్ట్ 60 కోట్లకు పైగా బడ్జెట్ తో ఈ సినిమా నిర్మాణం అవుతుందని వార్తలు రాగా లేటెస్ట్ గా సినిమా మేకర్స్ సినిమా బడ్జెట్ గురించి ఓపెన్ గానే చెప్పేశారు…

నాగ చైతన్య కెరీర్ లోనే ఈ సినిమా భారీ బడ్జెట్ తో తెరకెక్కుతుందని, ఆల్ మోస్ట్ 75 కోట్లకు పైగా బడ్జెట్ తో తండేల్ మూవీ రూపొందుతుందని, సినిమా ఔట్ పుట్ కూడా చాలా బాగా వస్తుందని, ఆడియన్స్ ముందుకు సినిమాను ఈ ఇయర్ ఎండ్ లో తీసుకు రావడానికి ప్లాన్ చేస్తున్నామని మేకర్స్ చెబుతున్నారు…

మొత్తం మీద 60 కోట్లకు పైగా బడ్జెట్ అనుకుంటే ఏకంగా 75 కోట్లకు పైగా బడ్జెట్ తో తెరకెక్కుతున్న తండేల్ మూవీ వరుస ఫ్లాఫ్స్ లో ఉన్న నాగ చైతన్య కి సాలిడ్ కంబ్యాక్ ఇస్తుందని మేకర్స్ నమ్మకంతో ఉన్నారు… నాన్ థియేట్రికల్ బిజినెస్ పరంగా కూడా జోరు చూపుతున్న తండేల్ మూవీ నాగ చైతన్యకి ఎలాంటి కంబ్యాక్ ఇస్తుందో చూడాలి ఇక… 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here