ఈ ఇయర్ ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి టాక్ ని దక్కించుకున్న సినిమాల్లో సమంత మరియు శర్వానంద్ లు కలిసి నటించిన జాను సినిమా కూడా ఒకటి. తమిళ్ లో విజయ్ సేతుపతి త్రిష ల కాంబినేషన్ లో వచ్చిన సూపర్ హిట్ మూవీ 96 సినిమా తెలుగు రీమేక్ గా వచ్చిన ఈ సినిమా తెలుగు లో రిలీజ్ అయ్యి పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకున్నా కానీ కలెక్షన్స్ లేక…
బాక్స్ ఆఫీస్ దగ్గర డిసాస్టర్ అయ్యింది. సినిమా 18.5 కోట్ల బిజినెస్ కి 19.2 కోట్ల టార్గెట్ తో బరిలోకి దిగి కేవలం 8.85 కోట్ల షేర్ ని మాత్రమే అందుకుని 9.9 కోట్లకు పైగా లాస్ ని దక్కించుకుని బాక్స్ ఆఫీస్ దగ్గర డిసాస్టర్ అవ్వగా… టెలివిజన్ లో టెలికాస్ట్ అయిన…
మొదటి సారి కూడా నిరాశ పరిచే TRP రేటింగ్ నే సొంతం చేసుకుని షాక్ ఇచ్చింది. ఫస్ట్ టైం టెలికాస్ట్ అయిన టైం లో ఈ సినిమా కి 7.03 TRP రేటింగ్ మాత్రమె దక్కగా రీసెంట్ గా సినిమా రెండో సారి కూడా టెలికాస్ట్ అయింది. ఫస్ట్ టైం చూడని వారు రెండో సారి చూస్తారు అనుకున్నా…
ఈ సినిమా కి రెండో సారి కూడా విముఖతనే దక్కింది. స్టార్ మా లో టెలికాస్ట్ అయిన రెండో సారి ఈ సినిమా కి కేవలం 4.1 TRP రేటింగ్ మాత్రమె దక్కడం నిరాశపరిచే విషయమే అని చెప్పాలి. తమిళ్ లో క్లాసిక్ అనిపించుకున్న సినిమా తెలుగు రీమేక్ మంచి టాక్ నే సొంతం చేసుకున్నా కానీ.
అటు బాక్స్ ఆఫీస్ దగ్గర ఇటు బుల్లి తెరపై ఇలా నిరాశ పరిచే ప్రదర్శన దక్కించుకోవడం షాకింగ్ అనే చెప్పాలి. మొత్తం మీద అన్ని రీమేక్ లు గోల్డ్ కావు కొన్ని ఇలా ఇత్తడి సరుకు కూడా అవుతాయి అనడానికి నిదర్శనంగా జాను సినిమా కూడా ఒకటని చెప్పొచ్చు..