ఎన్టీఆర్ ఇన్…..రామ్ చరణ్ ఔట్!!

0
874

     టాలీవుడ్ నంబర్ 1 డైరెక్టర్ ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వం లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ మరియు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ల కలయిక లో తెరకెక్కుతున్న సెన్సేషనల్ మల్టీ స్టారర్ RRR ఇప్పటి నుండే హ్యుమంగస్ క్రేజ్ ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. కాగా సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుండగా ఇద్దరు హీరోలని సమానంగా వాడుకుంటూ జక్కన్న ఈ సినిమా ను ఓ రేంజ్ లో చేక్కుతున్నాడని సమాచారం.

రీసెంట్ గా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ లాంగ్ షెడ్యూల్ ని ప్లాన్ చేసిన రాజమౌళి రీసెంట్ గా 20 రోజులకు పైగా జరిగిన షెడ్యూల్ ని ఆల్ మోస్ట్ ముగించాడట. ఈ సమయంలో ఖాళీ గా ఉండటం ఎందుకు అనుకున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్ వెకేషన్స్ లో బిజీ అవ్వగా…

రీసెంట్ గా తిరిగి రావడం తో ఎన్టీఆర్ షెడ్యూల్ సమయం వచ్చేసింది అని కన్ఫాం అయ్యింది. గురువారం యూనిట్ తో చేరిన ఎన్టీఆర్ తో రాజమౌళి భారీ షెడ్యూల్ ని చేయబోతున్నాడు. కాగా 22 రోజుల పాటు షెడ్యూల్ నాన్ స్టాప్ గా సాగ బోతుంది అని సమాచారం అందుతుండగా…

ఈ గ్యాప్ లో ఇప్పుడు రామ్ చరణ్ వెకేషన్స్ కి సిద్ధం అయ్యాడని సమాచారం. లాంగ్ వెకేషన్ ట్రిప్ కి వెళ్లి తిరిగి వచ్చి షూటింగ్ లో పాల్గొంటాడని సమాచారం. ఏది ఏమైనా రాజమౌళి ఇద్దరు హీరోలను ఎలాంటి ఇబ్బంది లేకుండా డేట్స్ క్లాష్ అవ్వకుండా…

బాగా ప్లాన్ చేస్తూ షూటింగ్ ని జరుపుతుండగా గ్యాప్ లో ఒకరు ఇన్ ఒకరు అవుట్ అంటూ హీరోలు కూడా ఎంజాయ్ చేస్తున్నారు. ఇక ఇద్దరు హీరోలు వచ్చే ఏడాది RRR తో బాక్స్ ఆఫీస్ దగ్గర కూడా సెన్సేషన్ రికార్డులు నమోదు చేయాలని అంతా కోరుకుంటున్నారు. న్యూస్ అప్ డేట్స్ కోసం బెల్ ఐకాన్ ని ప్రెస్ చేసి సబ్ స్బైబ్ చేసుకోండి.. అప్ డేట్ రాగానే నోటిఫికేషన్ మీకు అందుతుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here