Home న్యూస్ డూప్లికేట్ సినిమా….అక్కడ మిగిలింది ఇక్కడ వాడారు…కబ్జా పై దారుణమైన ట్రోల్స్!!

డూప్లికేట్ సినిమా….అక్కడ మిగిలింది ఇక్కడ వాడారు…కబ్జా పై దారుణమైన ట్రోల్స్!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర రీసెంట్ గా రిలీజ్ అయిన పాన్ ఇండియా మూవీ కబ్జా మొదటి ఆటకే ఓ రేంజ్ లో మిక్సుడ్ టాక్ ని సొంతం చేసుకుంది. సినిమా మార్నింగ్ షోలు బాగానే ఉన్నా తర్వాత టాక్ స్ప్రెడ్ అవ్వడంతో సినిమా కి భారీగా ఎదురుదెబ్బ తగిలింది. ఇక సినిమా కి ఎంత వద్దూ అనుకున్నా కానీ కేజిఎఫ్ తో పోలికల వలన విపరీతమైన ట్రోల్స్ పడుతున్నాయి సోషల్ మీడియా లో…

కేజిఎఫ్ సినిమా ను అలాంటి ఫార్మాట్ లోనే చిన్న పాయింట్ ని మార్చి తీసినట్లు ఉంది అంటూ ట్రోల్స్ చేస్తూ ఉండగా, కొందరైతే కేజిఎఫ్ సిరీస్ లో మిగిలిన ఫూటేజ్ ని ఇందులో వాడారేమో అన్నట్లు కామెంట్స్ చేస్తున్నారు. అవే సీన్స్, అవే షాట్స్, అదే విధంగా ఉన్న బ్యాగ్రౌండ్ స్కోర్…

ఇలా ప్రతీ సన్నివేశంలో కేజిఎఫ్ ని పోలి ఉన్న ఈ సినిమా కేజిఎఫ్ లా ఆకట్టుకోలేక పోయింది అంటూ ఈ సినిమా కేజిఎఫ్ కి సస్తా డూప్లికేట్ కాపీ అంటూ కూడా కామెంట్స్ చేస్తున్నారు. మేకర్స్ అలాగే హీరో కేజిఎఫ్ తో పోల్చొద్దు అంటూ కామెంట్స్ చేసినా యాసిటీస్ గా కేజిఎఫ్ లానే తీసిన తర్వాత…

ఆ సినిమా తో పోల్చకుండా ఎలా ఉంటారు అంటున్నారు… మొత్తం మీద సినిమా రీసెంట్ టైంలో భారీగా నెగటివ్ టాక్ ని సొంతం చేసుకున్న సినిమాలో ముందు నిలిచేలా ఉందని, కన్నడ వరకు జనాలు మరోసారి ఆదరించవచ్చు కానీ మిగిలిన చోట్ల సినిమా తేరుకోవడం కష్టమే అంటున్నారు ఇప్పుడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here