లాస్ట్ ఇయర్ డిసెంబర్ టైంలో ఆడియన్స్ ముందుకు భారీ అంచనాలతో వచ్చిన రణబీర్ కపూర్(Ranbir Kapoor) సందీప్ రెడ్డి వంగ(Sandeep Reddy Vanga) కాంబోలో వచ్చిన యానిమల్(Animal Movie) ఊహకందని వసూళ్ళతో ఊచకోత కోసింది…. ఆ సినిమా ఏ సర్టిఫికెట్ ను సొంతం చేసుకున్న మూవీస్ లో ఆల్ టైం హైయెస్ట్ కలెక్షన్స్ ని సాధించింది…
కానీ రిలీజ్ కి ముందు నుండే భారీ క్రేజ్ ఉన్న ఆ సినిమా రిలీజ్ అయ్యాక సూపర్ పాజిటివ్ టాక్ తో దుమ్ము లేపగా టోటల్ రన్ లో ఊహకందని కలెక్షన్స్ ని అందుకుంది. ఇప్పుడు ఈ సినిమా టోటల్ రన్ కలెక్షన్స్ ని మూడో వీకెండ్ లోనే క్రాస్ చేసేసింది రెబల్ స్టార్ ప్రభాస్(Prabhas) నటించిన….
పాన్ ఇండియా సెన్సేషనల్ మూవీ కల్కి 2898 AD(Kalki 2898 AD Movie)….మంచి పాజిటివ్ టాక్ తో దుమ్ము లేపిన కల్కి మూవీ లో అనుకున్న రేంజ్ లో కమర్షియల్ ఎలిమెంట్స్ లేకున్నా సైన్స్ ఫిక్షన్ కథనే అయినా కూడా ప్రభాస్ స్టార్ డం పవర్ తో దుమ్ము లేపుతూ దూసుకు పోతూ ఉండగా….
యానిమల్ మూవీ టోటల్ రన్ లో సాధించిన 913 కోట్లని మూడో వీకెండ్ ఎండ్ అయ్యే లోపే బ్రేక్ చేసి ప్రస్తుతానికి 960 కోట్లకు పైగా గ్రాస్ తో ఇండియన్ మూవీస్ లో హైయెస్ట్ గ్రాస్ ను వరల్డ్ వైడ్ గా అందుకున్న సినిమాల్లో ఒకటిగా దూసుకు పోతూ ఉండగా…
మూడో వీకెండ్ తర్వాత కొంచం స్లో అయినా కూడా సినిమాకి మరో వారం 10 రోజులు పెద్దగా పోటి లేక పోవడం, హిందీలో మంచి హోల్డ్ ని అలానే కొనసాగిస్తూ ఉన్న నేపధ్యంలో ఇప్పుడు సినిమా మిగిలిన రన్ లో సాధించే కలెక్షన్స్ తో నెక్స్ట్ టార్గెట్ అయిన పఠాన్(Pathaan) సాధించిన 1051 కోట్ల మార్క్ ని అందుకుంటుందా లేదా అన్నది ఆసక్తిగా మారింది…
సినిమాకి మూడో వీక్ లో వర్కింగ్ డేస్ లో మొహర్రం, తొలి ఏకాదశి లాంటి పార్షిక హాలిడేలు కలిసి రాబోతున్నాయి. మరీ ఫుల్ అడ్వాంటేజ్ ఉండకపోయినా ఈ పార్షిక హాలిడేలలో రెవెన్యూ కొంచం బెటర్ గా ఉండే అవకాశం ఉండటంతో లాంగ్ రన్ లో కల్కి జోరు కొనసాగే అవకాశం అయితే ఎంతైనా ఉందని చెప్పాలి.